Siva karthikeyan | తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన తాజా చిత్రం ‘పరాశక్తి’. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది. అయితే ఇదే సంక్రాంతి సందడి వేళ… శివ కార్తికేయన్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే మరో సినిమా ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అదే ‘అయలాన్’ (Ayalaan). దర్శకుడు ఆర్. రవికుమార్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్–ఏలియన్ మూవీ వాస్తవానికి 2024 సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారీ విజువల్ ఎఫెక్ట్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో తమిళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘అయలాన్’ సినిమాని అప్పట్లో తెలుగులో కూడా విడుదల చేయాలనే ప్లాన్ ఉన్నప్పటికీ, కొన్ని సాంకేతిక మరియు పంపిణీ సంబంధిత కారణాల వల్ల తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రాలేకపోయింది. ఆ తర్వాత ఈ చిత్రం తమిళంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు గుడ్ న్యూస్. ‘అయలాన్’ సినిమా ఫైనల్‌గా తెలుగు డబ్బింగ్‌తో మన తెలుగు ఓటీటీ యాప్ ‘ఆహా’లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడలేకపోయిన వారు, లేదా ఓటీటీలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు సౌకర్యంగా ఈ సినిమాను వీక్షించవచ్చు.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించగా, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఏలియన్ కాన్సెప్ట్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్, మెసేజ్ ఎలిమెంట్స్ కలగలిపి దర్శకుడు ఆర్. రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా పిల్లలు, కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా కావడంతో ఓటీటీకి మరింత అనుకూలంగా మారింది. మొత్తానికి ఈ సంక్రాంతి సీజన్లో శివ కార్తికేయన్ అభిమానులకు డబుల్ ట్రీట్ లభించినట్లే. ఒకవైపు ‘పరాశక్తి’ థియేటర్లలో సందడి చేయనుండగా, మరోవైపు ‘అయలాన్’ తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్కు రావడం విశేషంగా మారింది. శివ కార్తికేయన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఇది నిజంగా పండగే.