కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో మహా నగర పాలనను పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సర్కారు బుధవారం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించగా, సమన్వయం చేసేందుకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌కు ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ జీహెచ్ఎంసీ ప్రధా న కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కర్ణన్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జి. సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా టి. వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం కమిషనర్ కర్ణన్ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, 150 డివిజన్లతో జీహెచ్ఎంసీగా ఉండగా, 27 పురపాలికల విలీనంతో 300 డివిజన్లు ఏర్పాటు చేశారు. 60 సర్కిళ్లు, 12 జోన్లతో పరిపాలన వ్యవస్థ కొలువుదీరింది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : పాత జీహెచ్ఎంసీలోని కూకట్పల్లి , శేరిలింగంపల్లి జోన్లకు ..విలీనమైన నార్సింగి, మణికొండ, తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం, నిజాంపేట, దుండిగల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)లు కలిశాయి. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఏర్పాటైంది.
కార్పొరేషన్ల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాలు

బాధ్యతలు తీసుకున్న ముఖ్య అధికారులు
జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో ఆయా కమిషనర్లతో పాటు ముఖ్య అధికారుల నియామకాన్ని వెనువెంటనే ముఖ్య అధికారులకు ఆయా బాధ్యతలు అప్పగించడం, ఉత్తర్వులు అందుకున్న వెంటనే సంబంధిత అధికారులు బాధ్యతలను స్వీకరించారు.
