మంచిర్యాల, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రోజు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నట్లు అనిపించలేదు. ఓ వైపు ఓటింగ్ జరుగుతుంటే.. మరోవైపు అధికార పార్టీ దౌర్జన్యకాండ సాగించింది. చెన్నూర్ మున్సిపాలిటీలో రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ బైక్‌పై తిరుగుతూ ప్రచారం చేస్తూ కనిపించారు. మంత్రి హోదా లో పోలింగ్ సరళి తెలుసుకొనేందుకు పోలింగ్ కేంద్రాల్లో పర్యటిస్తే ఏమో అనుకోవచ్చు. కానీ.. బైక్‌పై ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కాంగ్రెస్ నా యకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక ఎన్పీ వాడలోని 4,5 వార్డుల్లో తిరిగారు. దీంతో ఓటర్లను మంత్రి ప్రలోభపెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కు వస్తుందని తెలిసినా.. అధికారులు పట్టించుకోకపోవడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ మంచిర్యా ల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హుటాహుటిన చెన్నూర్ పట్టణానికి చేరుకొని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన తెలిపారు. ప్ర జాస్వాయ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల కండువాలతో నిరసన తెలిపారు. ఇదే చెన్నూర్ మున్సిపాలిటీలో రెండో వార్డులో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి భర్త పోలింగ్ సెంటర్ దగ్గరే బహిరంగంగా డబ్బులు పంచుతూ, ఓటర్లను ప్రలోభపెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
దీన్ని నిరసిస్తూ స్థానిక ప్రభుత్వ ఉన్నత మహిళ పాఠశాలలోని పోలింగ్ బూత్‌లో బీఆర్ఎస్ నాయకులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. పోలింగ్ కేంద్రం ముందే కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పంపిణీ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పోలింగ్‌ను రద్దు చేసి రీ పోలిం గ్ నిర్వహించాలని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన అభ్యర్థిని పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని డి మాండ్ చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట పోలింగ్ కేంద్ర దగ్గర బీజేపీ నాయకులు పోలింగ్ స్లిప్‌లతోపాటు డబ్బులు పంచుతూ దొరికారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మరో డివిజన్లో ఓ మహిళ దొంగ ఓటు వేసి దొరికింది. అనుమానం వచ్చి ప్రశ్నించగా కాంగ్రెస్‌కు దొంగ ఓటు వేసినట్లు ఒప్పుకోవడంతో, అరెస్టు చేసి పో లీస్‌స్టేషన్‌కు తరలించారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వా ర్డులో బీఆర్ఎస్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించలేదు.
బీఆర్ఎస్కు మద్దతిస్తున్నాడని ఓ నాయకుడిపై దాడి చేసిన డీసీసీ అధ్యక్షుడు
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో మాజీ వా ర్డు మెంబర్, కాంగ్రెస్ నాయకుడు ఉప్పులేటి సురేశ్ బీఆర్ఎస్-సీపీఐ ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నాడని ఆరోపణల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నిం టి రఘునాథ్ సురేశ్‌పై దాడి చేశారు. దీన్ని నిరసిస్తూ సురేశ్ క్యాతన్‌పల్లిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు తాను టికెట్ ఆశించానని, కానీ డీసీసీ ప్రెసిడెంట్ రూ.5 లక్షలకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.
పోలింగ్ జరుగుతున్న సమయం లో కారులో వచ్చి నన్ను కారు ఎక్కమన్నారని, ఎక్కనందుకు నీ సంగతి చూస్తా.. నిన్ను బతకనివ్వను చంపు తా అని డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి తనను కొట్టారని ఆరోపించారు. డీసీసీ ప్రెసిడెంట్ దొంగ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన వచ్చి క్షమాపణలు చెప్పే దాకా రోడ్డు పైనుంచి లేచేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఇలా ఎన్నికల సమయంలో అధికార పార్టీ దౌర్జన్యాలకు దిగడం.. ప్రచా రం చేస్తూ, డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతుంటే ఎన్నికల సంఘం, అధికారులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసులు నమోదు చేయకుండా, చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సొంత పార్టీ నాయకుడిపై డీసీసీ అధ్యక్షుడి దాడి
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 11: క్యాతనపల్లి మున్సిపాలిటీలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి ఓవరాక్షన్ చేశాడు. బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థికి మద్దతు పలుకుతున్నాడనే కారణంతో సొంత పార్టీ నాయకుడు ఉప్పులేటి సురేశ్‌పై రఘునాథ్‌రెడ్డి బుధవారం దాడికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితుడు సురేశ్ కుటుంబంతో కలిసి రోడ్‌పై బైఠాయించాడు. దళితుడిని అయినందవల్లే తనపై కక్షగట్టి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యాలెట్ పేపర్ చింపిన వ్యక్తిపై కేసు
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 11 : కాగజ్‌నగర్ పట్టణంలోని రిక్షా కాలనీకు చెందిన సయ్య ద్ ఇమ్రాన్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వహిదుద్దీన్ బుధవారం తెలిపారు. పట్టణంలోని 13వ వార్డు రిక్షా కాలనీకి చెందిన సయ్యద్ ఇమ్రాన్ ఓటు వేసేందుకు రిక్షా కాలనీలోని కేంద్రానికి వెళ్లాడు. ఓటు వేసిన అనంతరం బ్యాలెట్ బాక్సులో వేసేక్ర మంలో.. అయ్యో నేను తప్పుడు గుర్తుకు ఓటు వేశానంటూ.. బ్యాలెట్ పేపర్‌ను చిం పాడు. దీంతో పీవో ఫిర్యాదు మేరకు ఇమ్రన్పై కేసు నమోదు చేశారు.
చనిపోయిందని ఓటు తొలగింపు
కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్ కాలనీకి చెందిన రాజమ్మ ఓటు వేయాడానికి స్థానిక శిశు మందిర్‌లోని పోలింగ్ కేంద్రానికి బుధవారం వెళ్లింది. ఎన్నికల అధికారులు ఓటరు జాబితాలో పరిశీలించగా, చనిపోయినట్లుగా ఉందని చెప్పడంతో అవాక్క య్యింది. బతికి ఉన్నప్పటికీ చనిపోయినట్లు అధికారులు ఎలా నమోదు చేశారని ఆగ్రహం వ్యక్త చేసింది.
అస్సాం నుంచి వచ్చి సీఆర్పీఎఫ్ ఉద్యోగి..
సీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 11 : అస్సాం రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ విభాగంలో పనిచేస్తున్న మంచిర్యాల జిల్లా విలేజ్ నస్పూర్‌కు చెందిన నిరీక్షణ బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నది. ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా బుధవారం ఫ్లైట్‌లో ఇక్కడికి వచ్చి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్‌కు సంబంధించి, విలేజ్ నస్పూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిరీక్షణ తండ్రి జిలుకర వెంకటి మున్సిపాలిటీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.