IND vs NZ 3rd Test : వాంఖడేలో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81)లు తిప్పేయడంతో న్యూజిలాండ్‌ను 235 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత తడబడింది. ఆఖరి సెషన్లో తొందరపాటుకు పోయి కీలక వికెట్లు కోల్పోయింది. అజాజ్ పటేల్ రెండు వికెట్లతో రోహిత్ సేనను దెబ్బకొట్టాడు. దాంతో, తొలి రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(31 నాటౌట్), రిషభ్ పంత్(1)లు క్రీజులో ఉన్నారు. ఇంకా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు వెనకబడి ఉంది.
వాంఖడేలో టాస్ ఓడినా తొలి రోజు టీమిండియాకు కలిసొచ్చింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసి కివీస్ బ్యాటర్ల జోరును అడ్డుకున్నారు. ఇక స్పిన్నర్లు రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81)లు మరోసారి రాణించగా 235 పరుగలకే ప్రత్యర్థిని రోహిత్ సేన ఆలౌట్ చేసింది. కానీ, తొలి రోజు ఆట ముగిసే సరికి కివీస్ ఆటగాళ్లు నాలుగు వికెట్లు తీసి సంతోషంగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లింది.
Stumps on the opening day of the Third Test in Mumbai.#TeamIndia move to 86/4 in the 1st innings, trail by 149 runs.
See you tomorrow for Day 2 action
Scorecard – https://t.co/KNIvTEyxU7#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/ppQj8ZBGzz
— BCCI (@BCCI) November 1, 2024
తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి కివీస్‌పై ఒత్తిడి పెంచాలనుకున్న టీమిండియా వ్యూహం ఫలించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (18) ధాటిగా ఇన్నింగ్స్ మొదలెట్టినా మ్యాట్ హెన్రీకి దొరికిపోయాడు. అయినా శుభ్‌మన్ గిల్(30 నాటౌట్) జతగా యశస్వీ జైస్వాల్(30) దంచాడు. స్వీప్ షాట్లతో అజాజ్ పటేల్‌పై పైచేయి సాధించిన యశస్వీ చివరకు అలాంటి షాట్ ఆడబోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
అంతే.. చూస్తుండగానే రెండు వికెట్లు పడ్డాయి. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన మహ్మద్ సిరాజ్(0)ను ఆ తర్వాతి బంతికే అజాజ్ ఎల్బీగా ఔట్ చేసి హ్యాట్రిక్ మీద నిలిచాడు. అయితే.. విరాట్ కోహ్లీ(4) అతడికి కలను కల్లలు చేశాడు. కానీ, నాటౌట్‌గా మాత్రం నిలువలేకపోయాడు. రచిన్ రవీంద్ర ఓవర్లో అనవసర పరుగుకు ప్రయత్నించిన కోహ్లీని మ్యాట్ హెన్రీ డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు.
WOW! India lose 3 wickets in the last 2 overs of the day!
🔗 https://t.co/bnmexdFFSD | #INDvNZ pic.twitter.com/YB0YBD2neN
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2024
అంతే.. 72-2తో పటిష్టంగా కనిపించిన భారత్ 84 వద్ద 4 వికెట్లు కోల్పోయింది. మైదానంలో అంతా నిశబ్దంగా మారిపోయింది. కోహ్లీ తర్వాత వచ్చిన రిషభ్ పంత్(1) రిస్క్ తీసుకోకుండా ఆడాడు. దాంతో, తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది.
తొలి రెండు టెస్టుల్లో భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న న్యూజిలాండ్ వాంఖడేలో తేలిపోయింది. స్టార్ ఆటగాళ్లు విఫలం కాగా మూడో సెషన్లోనే ఆలౌటయ్యింది. భారత స్పిన్నర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేయగా టీ తర్వాత కాసేపటికే కివీస్ కుప్పకూలింది.
A round of applause for Ravindra Jadeja! 👏 👏
He scalps his 1⃣4⃣th FIFER in Test cricket ✅
Well done! 🙌 🙌
Live ▶️ https://t.co/KNIvTEy04z#TeamIndia | #INDvNZ | @imjadeja | @IDFCFIRSTBank pic.twitter.com/I1UwZN94CM
— BCCI (@BCCI) November 1, 2024
రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(481)లు తిప్పేయగా 250 లోపే పర్యాటక జట్లు ఇన్నింగ్స్ ముగిసింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న డారిల్ మిచెల్(82)ను ఔట్ చేసిన సుందర్.. అజాజ్ పటేల్(7)ను ఎల్బీగా వెనక్కి పంపి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.