హైదరాబాద్ : త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడని బీజేపీ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడు నెలల నుంచి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. కేరళ వెళ్లినా కూడా రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. అక్కడ దూరం నుంచి చూసి వచ్చాడు తప్పా కలువలేదన్నారు.
మూసీ ప్రాజెక్టు వ్యయంను మూడు రెట్లు పెంచిన తరువాత అవినీతి ఉందని బైట పడింది.. అందుకోసమే ప్రక్షాళన చేపట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిని సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదని, జూన్ నుంచి డిసెంబర్ లోపు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రావడం ఖాయమన్నారు. తాను రీసెర్చ్ చేస్తేనే మాట్లాడుతానని స్పష్టం చేశారు. మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.