అమరావతి : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించకుండా అమరజీవి పొట్టిశ్రీరాములును అవమానపరిచిన సీఎం చంద్రబాబు(Chandra Babu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawankalyan) రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Former minister Roja ) డిమాండ్ చేశారు. అవతరణ దినాన్ని జరుపకుండా ఆరుకోట్ల ఆంధ్రులను అవమానించారని శుక్రవారం ఆమె ట్విటర్ వేదిక ద్వారా ఆరోపించారు.
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాకు అవతరణ దినం ఉంది. చంద్రాబాబు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఏపీకి అవతరణ దినం లేకుండా పోయిందని తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించామని వెల్లడించారు.
పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని అవహేళన చేసేలా నిర్ణయించడం దారుణమని, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా..? మీరసలు పాలకులేనా ? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని కోరారు.