BGT 2024-05 : సొంతగడ్డపై వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించింది భారత పురుషుల క్రికెట్ జట్టు. స్వదేశంలో తమ ఆధిపత్యాన్ని చాటుతున్న రోహిత్ సేన త్వరలోనే న్యూజిలాండ్ సవాల్‌కు సిద్ధం కానుంది. అనంతరం నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా పకడ్బందీగా వెళ్లనుంది. ఎందుకంటే.. వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలిచిన భారత్‌కు కీలకమైన సిరీస్ అది. అందుకని బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(BGT 2024-25) లో గెలుపే లక్ష్యంగా బలైమన స్క్వాడ్‌ను ఎంపిక చేయనున్నారు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వీ జైస్వాల్ ఓపెనింగ్ చేయడం ఖరారై పోయింది. ఇక బ్యాకప్ ఓపెనర్ కోసం చూస్తున్న టీమిండియాకు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) బెస్ట్ చాయిస్ కానున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ విజయం కొట్టేసి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడమే భారత జట్టు ముందున్న లక్ష్యం.
Chris Lynn believes the Border-Gavaskar Trophy nearly holds greater significance than the historic Ashes!
Do you agree? pic.twitter.com/MAQ82MSAFa
— CricTracker (@Cricketracker) September 30, 2024
అందుకు తగ్గట్టే ఏడాదిన్నర కాలంగా టీమిండియా ఆట సాగుతోంది. అద్భుతంగా ఆడుతోంది. వరుసగా టెస్టు సిరీస్ విజయాలతో ప్రత్యర్థులను వణికిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. మిడిలార్డర్లో కోహ్లీ, గిల్, పంత్, రాహుల్‌లు దంచేస్తున్నారు. బుమ్రా, ఆకాశ్ దీప్.. స్పిన్ ద్వయం అశ్విన్, జడేజాలతో బౌలింగ్ యూనిట్ కూడా పటిష్ఠంగా కనిపిస్తోంది.
అయితే.. రోహిత్, యశస్వీలలో ఒకరు గాయపడితే బ్యాకప్‌గా మరో ఓపెనర్ అవసరం. అందుకని స్క్వాడ్‌లో మూడో ఓపెనర్‌గా రుతురాజ్ ఉండే అవకాశముంది. టీ20ల్లో చెలరేగి ఆడే అతడు.. దేశవాళీలో రెడ్ బాల్ క్రికెట్లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ మధ్యే ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ రుతురాజ్ అర్ధ శతకాలతో విజృంభించాడు. ఇప్పటివరకూ 32 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఈ డాషింగ్ బ్యాటర్ 2,273 రన్స్ బాదాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి.
ఐసీసీ వన్డే, టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలను ముద్దాడిన టీమిండియాను టెస్టు గద(Test Mace) ఊరిస్తోంది. రెండు పర్యాయాలు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరినా రెండు సార్లు నిరాశగానే వెనుదిరిగింది. తొలి సీజన్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా 2021లో ఫైనల్ చేరింది. కానీ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన న్యూజిలాండ్ చాంపియన్‌గా అవతరించింది. నిరుడు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ చేజేతులా ఆస్ట్రేలియాకు టెస్టు గదను అప్పగించింది.
India inch closer to securing a spot in the World Test Championship final after their remarkable win in Kanpur.#INDvBAN #WTC25 #TeamIndia pic.twitter.com/hmnY4CEqYg
— Circle of Cricket (@circleofcricket) October 1, 2024
అందుకని మూడోసారి ఎలాగైనా ఫైనల్ చేరి.. మూడు ఫార్మాట్లలో ట్రోఫీ గెలుపొందిన జట్టుగా రికార్డు సృష్టించాలని భావిస్తోంది. ఇప్పటికైతే ఆసీస్ మాత్రమే మూడు ఫార్మాట్లలో ఐసీసీ విజేతగా అవతరించింది. నవంబర్ 22న భారత్, ఆస్ట్రేలియాల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలవ్వనుంది. ఈసారి ప్రత్యేకత ఏమంటే.. 1992 తర్వాత మొదటిసారి ఈ ట్రోఫీని ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా నిర్వహిస్తున్నారు.