Edgbaston Test : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌కు షాకిస్తూ భారత జట్టు భారీ స్కోర్ చేసింది. లీడ్స్‌లో ఎదురైన ఓటమి నుంచి తేరుకొని.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(269) చరిత్రలో నిలిచేపోయే ఇనన్నింగ్స్ ఆడగా .. రవీంద్ర జడేజా(89), ఓపెనర్ యశస్వీ జైస్వాల్(87) కొండంత పరుగులో భాగమయ్యారు. రెండో రోజు తొలి సెషన్ నుంచి ఇంగ్లండ్ బౌలర్లకు కొరకుడుపడని కొయ్యలా మారిన గిల్ ద్విశతకంతో కదం తొక్కిన వేళ టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే.. ఆరొందలకు మరో 13 పరుగలు దూరంలోనే ఆగిపోయింది.
లీడ్స్‌లో మాదిరిగానే బెన్ స్టోక్స్ సేన టెయిలెండర్లను చుట్టేసింది. గిల్ పెవిలియన్ చేరడమే ఆలస్యం ఆకాశ్ దీప్(6) పెద్ద షాట్‌కు యత్నించి బెన్ డకెట్‌కు సులువైన క్యాచ్ ఇచ్చాడు. బషీర్ బౌలింగ్‌లో సిరాజ్(8) పిచ్ వదిలి షాట్ ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. దాంతో, 587 వద్ద భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మరో విషయం ఏంటంటే.. ఈమధ్య కాలంలో బజ్ బాల్ ఆటను అలవర్చుకున్న ఇంగ్లండ్ ఒక ఇన్నింగ్స్‌లో ఇన్నేసి పరుగులు ఇవ్వడం ఇదే ప్రథమం.
Innings Break!
A mighty batting display from #TeamIndia! 🙌 🙌
2⃣6⃣9⃣ for captain Shubman Gill
8⃣9⃣ for Ravindra Jadeja
8⃣7⃣ for Yashasvi Jaiswal
4⃣2⃣ for Washington SundarUpdates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @ShubmanGill | @imjadeja | @ybj_19 | @Sundarwashi5 pic.twitter.com/WkhwqLxXJB
— BCCI (@BCCI) July 3, 2025
ఐదు టెస్టుల సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో పంజా విసిరింది. తొలి రోజు ఆధిపత్యాన్ని రెండో రోజు కొనసాగిస్తూ ఇంగ్లండ్ బౌలర్లకు దిమ్మతిరిగేలా చేసింది టీమిండియా. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(269) క్రీజులో పాతుకుపోయి బౌండరీలు బాదినట్టుగా రికార్డులు బద్ధలు కొడుతుంటే స్టోక్స్ సేన చేష్టలుడిగి చూస్తుండిపోయింది. గిల్ ఒక్కడే సగం స్కోర్ చేయగా జడేజా, యశస్వీలు బౌలర్లకు చుక్కలు చూపించగా భారత్ 587 రన్స్ కొట్టింది. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ మూడు వికెట్లు తీయగా.. టంగ్, వోక్స్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
మొదటి రోజే ఆతిథ్య జట్టు పేసర్లను ఆడేసుకున్న ఈద్వయం రెండో రోజు తొలి సెషన్లోనూ జోరు చూపించింది. సింగిల్స్, డబుల్స్,, వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో వేగం పెంచారిద్దరూ. జడ్డూ కెరియర్లో 32వ హాఫ్ సెంచరీ సాధించగా.. గిల్ సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక స్కోర్‌తో రికార్డు సృష్టించాడు. ఆరో వికెట్‌కు 200 ప్లస్ భాగస్వామ్యంతో భారత్ స్కోర్ నాలుగొందలు దాటించిందీ జోడీ. అయితే.. కాసేపట్లో లంచ్ అనగా సెంచరీ దిశగా వెళ్తున్న జడేజాను జోష్ టంగ్ వెనక్కి పంపాడు. ఎక్స్ ట్రా బౌన్స్ అయిన బంతి వికెట్ కీపర్ జేమీ స్మిత్ చేతుల్లో పడింది. దాంతో, 414 వద్ద భారత జట్టు ఆరో వికెట్ కోల్పోయింది.
Highest Individual score by an Indian Càptain against England in England in Test History
180* – Shubman Gill – Edgbaston 2025
179 – M Azharuddin – Old Trafford 1990
149 – Virat Kohli – Edgbaston 2018
148 – MAK Pataudi – Headingley 1967
147 – Shubman Gill – Headingley 2035
128 -… pic.twitter.com/F3ovOi4jaN— All Cricket Records (@Cric_records45) July 3, 2025
లంచ్ బ్రేక్ తర్వాత జోరు పెంచిన గిల్ ఇంగ్లండ్ నేల మీద అత్యధిక స్కోర్(179) చేసిన భారత కెప్టెన్‌గా అజారుద్దీన్ (Azharuddin) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. గాల్లోకి పంచ్‌లు విసురుతూ సంబురాలు చేసుకున్నాడు. అంతుకుముందు టంగ్ ఓవర్లో కవర్ డ్రైవ్‌తో ఫోర్ బాదిన గిల్ 190కి చేరువైన గిల్.. అనంతరం మూడో బంతిని డీప్ స్వ్కేర్ లెగ్‌లో ఫోర్ రాబట్టాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్(22 నాటౌట్) కు ఛాన్సిచ్చిన అతడు టంగ్ ఓవర్లోనే సింగిల్‌తో కెరియర్లో తొలి డబుల్ కలను సాకారం చేసుకున్నాడు.
🚨 𝗠𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 𝗔𝗹𝗲𝗿𝘁 🚨
Highest Score for a #TeamIndia captain in an innings of a Test match 🔝
Well done, Captain Shubman Gill 🙌 🙌
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @ShubmanGill pic.twitter.com/oxCSBXOEvR
— BCCI (@BCCI) July 3, 2025
వాషింగ్టన్ సుందర్ (42)తో ఏడో వికెట్‌కు 144 రన్స్ జమ చేయగా భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ ఇద్దరి జోరుతో డీలా పడిన ఇంగ్లండ్‌కు జో రూట్ బ్రేకిచ్చాడు. అర్ధ శతకానికి చేరువైన సుందర్‌ను బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టుకు ఊరటనిచ్చాడు. సుందర్ బౌల్డ్ కావడంతో 558 వద్ద టీమిండియ వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ట్రిపుల్ సెంచరీకి చేరువైన గిల్‌ను టంగ్ వెనక్కి పంపగా.. ఆకాశ్ దీప్, సిరాజ్‌లు త్వరగా పెవిలియన్ చేరడంతో ఆరొందల లోపే భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది.