Edgbaston Test : బర్మింగ్హమ్లోని ఎడ్జ్‌బాస్టన్‌లో శుభ్‌మన్ గిల్(269) రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. రెండో రోజు తొలి సెషన్ నుంచి ఇంగ్లండ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత కెప్టెన్ ఎట్టకేలకు ఔటయ్యాడు. టీ సెషన్ ముందే 250 మార్క్ చేరుకున్న గిల్.. ట్రిపుల్ సెంచరీ కొట్టడం ఖాయనుకున్నారంతా. అయితే.. మూడో సెషన్లో అతడు టంగ్ ఓవర్లో ఓలీ పోప్ చేతికి చిక్కాడు. 574 రన్స్ వద్ద అతడు ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన గిల్‌కు సహచరులు, స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందనలు తెలిపారు.
ఎడ్జ్‌బాస్టన్‌లో భారత జట్టు ఆరొందల స్కోర్‌కు చేరువైంది. రెండో సెషన్లోనూ జోరు చూపించిన గిల్, మూడో సెషన్లో వెనుదిరిగాడు. రెండో రోజు రవీంద్ర జడేజా(89)తో 200 ప్లస్ భాగస్వామ్యం నెలకొల్పిన సారథి.. అనంతరం వాషింగ్టన్ సుందర్ (42)తోనూ విలువైన రన్స్ జోడించాడు.
It’s Tea on Day 2 of the 2nd Test! #TeamIndia power along to 564/7, with captain Shubman Gill marching to 2⃣6⃣5⃣ 👌 👌
Third session of the Day to begin 🔜
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @ShubmanGill pic.twitter.com/2nkCZjO2x2
— BCCI (@BCCI) July 3, 2025
ఏడో వికెట్‌కు సుందర్, గిల్ ఏకంగా 144 రన్స్ జమ చేయగా భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ ఇద్దరి జోరుతో డీలా పడిన ఇంగ్లండ్‌కు జో రూట్ బ్రేకిచ్చాడు. అర్ధ శతకానికి చేరువైన సుందర్‌ను బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టుకు ఊరటనిచ్చాడు. సుందర్ బౌల్డ్ కావడంతో 558 వద్ద టీమిండియ వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.