IND vs BAN 1st T20 : టెస్టు సిరీస్ విజయోత్సాహాన్ని టీమిండియా టీ20 సిరీస్‌లోనూ కొనసాగించింది. తొలుత బంగ్లాదేశ్‌ను కట్టడి చేసిన భారత్ స్వల్ప లక్ష్యాన్ని 11.5 ఓవర్లలోనే ఛేదించింది. హార్దిక్ పాండ్యా(39 నాటౌట్), సంజూ శాంసన్(29), సూర్యకుమార్ యాదవ్(29)లు బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికేస్తూ బండరీల మోత మోగించారు. గ్వాలియర్‌లో 14 ఏండ్ల తర్వాత జరిగిన మ్యాచ్‌లో సూపర్ విక్టరీ కొట్టిన టీమిండియా మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
దాంతో.. భారత స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఈ ముగ్గురు ఫటాఫట్ ఆడడంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలర్ల విజృంభణతో బంగ్లాను కట్టడి చేసిన భారత్.. చిన్న లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ(16), సంజూ శాంసన్(29)లు తొలి ఓవర్ నుంచే ఉతికేశారు. అయితే.. సంజూతో సమన్వయలోపంతో అభిషేక్ రనౌట్ కావడంతో 25 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29) తన స్టయిల్లో రెచ్చిపోగా.. మాజీ సారథి హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.
Arshdeep Singh becomes the Player of the Match for his economical three-wicket haul 👏👏
Scorecard – https://t.co/Q8cyP5jXLe#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/MphxyzdHsn
— BCCI (@BCCI) October 6, 2024
రెండు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన బంగ్లాదేశ్ పొట్టి సిరీస్ తొలి మ్యాచ్‌లో తడబడింది. గ్వాలియర్ స్టేడియంలో భారత బౌలర్ల ధాటికి బంగ్లా టాపార్డర్ కుప్పకూలింది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్(3/14), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(3/31)లు మూడేసి వికెట్లతో విజృంభించగా బంగ్లా ఆటగాళ్లతో సగం మంది కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు.
𝙎𝙈𝘼𝘾𝙆𝙀𝘿 with power and timing!@hardikpandya7 dispatches one over deep extra cover 🔥
Live – https://t.co/Q8cyP5jXLe#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/kNaZjSl1Tq
— BCCI (@BCCI) October 6, 2024
10 ఓవర్లలోపే సగం వికెట్లు కోల్పోయిన జట్టును మెహిదీ హసన్ మిరాజ్(35), కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(27)లు ఆదుకున్నారు. దాంతో, బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటయ్యింది. ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో మొదటి ఓవర్ మెయిడెన్ వేసిన మూడో భారత బౌలర్‌గా అతడు రికార్డు నెలకొల్పాడు. మయాంక్ కంటే ముందు అజిత్ అగార్కర్, అర్ష్‌దీప్ సింగ్‌ల పేరిట ఈ రికార్డు ఉంది.