Watch: కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా వేదికపైకి వెళ్లేందుకు వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికపైకి చేరుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆప్ కార్యకర్తలు, పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal) భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికపైకి చేరుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆప్ కార్యకర్తలు, పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆదివారం ఢిల్లీలోని ఛత్రసల్ స్టేడియంలో ‘జనతా కీ అదాలత్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు.
కాగా, సభకు హాజరైన వారిలో ఒక వ్యక్తి ఈ సందర్భంగా కలకలం సృష్టించాడు. ఉన్నట్టుండి ఆ వేదిక వద్దకు వెళ్లేందుకు అతడు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్ కార్యకర్తలు అతడ్ని పట్టుకున్నారు. అయితే కేజ్రీవాల్‌కు ఏదో చెప్పేందుకు ఆ వ్యక్తి సైగలు చేశాడు. చివరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బయటకు తరలించారు.
మరోవైపు ఈ సంఘటన జరిగినప్పుడు ఢిల్లీ సీఎం అతిషి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, గోపాల్ రాయ్ వంటి ఆప్ ముఖ్య నేతలు ఆ వేదికపై ఉన్నారు. ఈ నేపథ్యంలో జరిగిన భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
दिल्ली के पूर्व सीएम अरविंद केजरीवाल की सुरक्षा में चूक का मामला भी सामने आया है… बताया जा रहा है कि छत्रसाल स्टेडियम में सभा को संबोधित करते वक्त मंच पर एक शख्स ने चढ़ने की कोशिश की… दरअसल अरविंद केजरीवाल जनता की अदालत कार्यक्रम को संबोधित कर रहे थे… इसी दौरान ये वाकया… pic.twitter.com/O9z1ptpEUU
— Bharat 24 – Vision Of New India (@Bharat24Liv) October 6, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

