UPI payments |రూ.2,000 దాటిన యూపీఐ పేమెంట్లపై చార్జీలు.. కొత్త చట్టంపై కసరత్తు చేస్తున్న కేంద్రం
UPI payments : దేశంలో ప్రస్తుతం యూపీఐ సేవల వినియోగం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు యూపీఐ సేవలన్నీ ఉచితమే. కానీ, ఇకపై ఈ విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. యూపీఐ సేవలపై స్వల్ప ఫీజు వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
UPI payments : దేశంలో ప్రస్తుతం యూపీఐ సేవల వినియోగం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు యూపీఐ సేవలన్నీ ఉచితమే. కానీ, ఇకపై ఈ విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. యూపీఐ సేవలపై స్వల్ప ఫీజు వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం చట్టంలో మార్పులు తీసుకురానుంది. యూపీఐ పేమెంట్స్‌కు సంబంధించి అమలులో ఉన్న పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్‌కు పార్లమెంట్లో సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఈ సవరణ చట్టం అమలులోకి వస్తే యూపీఐ లావాదేవీలపై పరిమితమైన ఛార్జీలు విధిస్తారు. ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. కొత్త చట్టం ద్వారా పేమెంట్ ఇండస్ట్రీ వర్గాల ఎప్పటినుంచో కోరుతున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు చేస్తారు. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం రూ.2,000 అంతకన్నా ఎక్కువ పేమెంట్స్‌పై 0.3 నుంచి 0.5 శాతం వరకు ఛార్జీ వసూలు చేస్తారు. అయితే, ఈ ఛార్జీని వినియోగదారుడు చెల్లించాల్సిన అవసరం లేదు. పేమెంట్ అందుకున్న వ్యాపారులు మాత్రమే ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, కొత్త చట్టం ద్వారా యూపీఐ వినియోగదారులపై ఎలాంటి ఛార్జీలు, భారం పడదు. వ్యాపారులు మాత్రమే ఆ మొత్తం చెల్లించాలి. అది కూడా వార్షికాదాయం రూ.1.5 కోట్లు దాటిన వ్యాపారులే. చిన్న వ్యాపారులపై దీని ప్రభావం ఉండదు. భారీ వ్యాపారం చేసే వారిపైనే భారం పడుతుంది.
ఈ చట్టం ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ దీన్ని అమలు చేయాలనుకున్నా.. ఎలా అమలుచేయాలి, దీని చట్టబద్ధత వంటి అంశాలపై పరిశీలన జరుగుతోంది. న్యాయపరమైన అంశాల్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాతే ఇది పార్లమెంట్లో సవరణకు వస్తుంది. అంతవరకు ప్రస్తుతం అమలవుతున్న విధానంలో ఏ మార్పూ లేదు. వినియోగదారులతోపాటు, వ్యాపారులు కూడా అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించనవసరం లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

