Mr Celebrity | ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ (Paruchuri Sudarshan)డెబ్యూ మూవీ ‘మిస్టర్ సెలెబ్రిటీ’ (Mr Celebrity). రవికిశోర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుండటంతో టీం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంది.
మేం ఎన్నో సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందించాం. కానీ ఇప్పుడొస్తున్న దర్శకులు కథ, కథనం, మాటలు, దర్శకత్వం అన్నీ వాళ్లే రాసుకుంటున్నారు. డైరెక్టర్‌కు అన్ని క్రాఫ్ట్స్ మీద పట్టుండాలి. అప్పుడే సినిమాను బ్యాలెన్స్ చేయగలడు. సెలబ్రిటీల మీద పుకార్లు రావడం, దాని వల్ల ఏర్పడే పర్యావసనాల మీద కథ రాసుకున్నాడు డైరెక్టర్ రవి కిశోర్. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోందన్నారు.
మిస్టర్ సెలబ్రిటీని విజయవంతం చేసిన ప్రేక్షకులకు నిర్మాత పాండు రంగారావు ధన్యవాదాలు తెలియజేశారు. తానిక్కడికి వచ్చానంటే పరుచూరి ఫ్యామిలీనే కారణమని డైరెక్టర్ రవికిశోర్ అన్నాడు. సినిమా సక్సెస్‌లో భాగమైన ప్రతీ ఒక్కరి ధన్యదాలు తెలియజేశాడు డైరెక్టర్.
ఈ చిత్రంలో వరలక్ష్మీశరత్‌కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు కీలక పాత్రల్లో నటించారు. ఆర్పీ సినిమాస్ బ్యానర్‌పై ఎన్.పాండురంగారావు, చిన్న రెడ్డయ్య నిర్మించిన ఈ చిత్రానికి వినోద్ యజమాన్య సంగీతం అందించాడు.
Read Also :
Committee Kurrollu | సెలబ్రేషన్స్ టైం.. కమిటీ కుర్రోళ్లు ఖాతాలో అరుదైన పురస్కారం
Siddu Jonnalagadda | జాక్ షూట్ గురించి చెప్పిన సిద్ధు జొన్నలగడ్డ
They Call Him OG | ఓజీ అప్డేట్స్ త్వరలో.. పవన్ కల్యాణ్ అభిమానులను ఎస్ థమన్ గుడ్‌న్యూస్
Khel Khel Mein | ఓటీటీలోకి అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?