IND vs BAN 1st T20 : ఇప్పటికే టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ అయిన బంగ్లాదేశ్ పొట్టి సిరీస్ తొలి మ్యాచ్‌లో తడబడింది. గ్వాలియర్ స్టేడియంలో భారత బౌలర్ల ధాటికి బంగ్లా టాపార్డర్ కుప్పకూలింది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్(3/14), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(31/31)లు మూడేసి వికెట్లతో విజృంభించగా బంగ్లా ఆటగాళ్లతో సగం మంది కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. 10 ఓవర్లలోపే సగం వికెట్లు కోల్పోయిన జట్టును మెహిదీ హసన్ మిరాజ్(35), కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(27)లు ఆదుకున్నారు. దాంతో, బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటయ్యింది.
టాస్ ఓడిన బంగ్లాదేశ్‌ను యువపేసర్ అర్ష్‌దీప్ సింగ్ సూపర్ స్పెల్‌తో ముప్పతిప్పలు పెట్టాడు. మొదట ఓపెనర్ లిట్టన్ దాస్(8)ను ఔట్ చేసిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆ తర్వాత మరో ఓపెనర్ పర్వేజ్ హొసేన్ ఎమోన్(4)ను బౌల్డ్ చేసి భారత్‌కు బ్రేకిచ్చాడు. అతడి తర్వాత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేశాడు.
Innings Break!
A magnificent bowling performance restricts Bangladesh to 127 👏👏#TeamIndia‘s chase coming up shortly ⏳
Scorecard – https://t.co/Q8cyP5jXLe#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Gu6wQLPXxg
— BCCI (@BCCI) October 6, 2024
వరుణ్ బౌలింగ్‌లో ఏ షాట్ ఆడాలో తెలియక తౌహిద్ హృదయ్(12), జకీర్ అలీ(8)లు పెవిలియన్ చేరారు. అరంగేట్రం చేసిన పేసర్ మయాంక్ యాదవ్ ప్రమాదకరమైన మహ్మదుల్లా(1)ను బోల్తా కొట్టించాడు. దాంతో.. ప్రధాన వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. ఆ దశలో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(27), మెహిదీ హసన్ మిరాజ్(35)లు జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు.