IND vs BAN 1st T20 : పొట్టి సిరీస్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. గ్వాలియర్ స్టేడియంలో భారత బౌలర్ల ధాటికి బంగ్లా టాపార్డర్ కుప్పకూలింది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్(2/8), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(2/28)ల విజృంభణతో వచ్చినవాళ్లు వచ్చినట్టే పెవిలియన్ వెళ్తున్నారు. దాంతో బంగ్లాదేశ్ జట్టు 10 ఓవర్లలోపే సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(24), ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్(6)లు జాగ్రత్తగా ఆడుతున్నారు. బంగ్లా స్కోర్.. 64/5.
రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను వైట్ వాష్ చేసిన భారత జట్టు తొలి టీ20లో అదరగొడుతోంది. టాస్ ఓడిన బంగ్లాదేశ్‌ను అర్ష్‌దీప్ సింగ్ తన బౌన్స్, పేస్‌తో వణికించాడు. తొలుత డేంజరస్ ఓపెనర్ లిట్టన్ దాస్(8)ను ఔట్ చేసిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆ తర్వాత మరో ఓపెనర్ పర్వేజ్ హొసేన్ ఎమోన్(4)ను బౌల్డ్ చేసి భారత్‌కు బ్రేకిచ్చాడు.
The first of many more! ⚡️
📽️ WATCH Mayank Yadav’s maiden international wicket 😎
Live – https://t.co/Q8cyP5jXLe#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Q0XvZGBQrq
— BCCI (@BCCI) October 6, 2024
అతడి తర్వాత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేశాడు. అతడి బౌలింగ్‌లో ఏ షాట్ ఆడాలో తెలియక తౌహిద్ హృదయ్(12), జకీర్ అలీ(8)లు పెవిలియన్ చేరారు. అరంగేట్రం చేసిన పేసర్ మయాంక్ యాదవ్ ప్రమాదకరమైన మహ్మదుల్లా(1)ను బోల్తా కొట్టించాడు. దాంతో.. ప్రధాన వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఆలౌట్ ప్రమాదంలో పడింది.