Neymar Jr : క్రికెటర్లు, ఫుట్‌బాల్ ఆటగాళ్లు, సినిమా తారలు ఖరీదైన భవంతులు కొనడం చూశాం. వీదేశాల్లో అయితే కొందరు ఫుట్‌బాల్ ప్లేయర్లు సొంతంగా దీవులను కొనేస్తుంటారు. ప్రకృతి రమణీయత, చుట్టూరా నీ తాజాగా ఈ జాబితాలో బ్రెజిల్ యువకెరటం నెయ్మర్ జూనియర్ (Neymar Jr) చేరనున్నాడు. తమదేశంలోని జపావో ఐలాండ్‌ను అతడు భారీ ధరకు సొంతం చేసుకోబోతున్నాడు. అమ్మకందారుడితో రూ.64 కోట్లకు బేరం కుదిరిందని, త్వరలోనే నెయ్మర్ ఆ ఐలాండ్‌లో సేదతీరనునన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆట ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించిన అతడి పేరిట ఇప్పటికే ఎన్నో ఆస్తులు ఉన్నాయి. ఖరీదైన భవంతులు అతడు కొన్నాడు. ఇక కొత్తగా ద్వీపాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక జపావో ఐలాండ్ విషయానికొస్తే.. 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఒక ప్రధాన విల్లా, రెండు మాస్టర్ సూట్లు, సముద్రపు అందాల్ని వీక్షించేందుకు వీలుగా రెండు పెద్ద భవంతులు ఉన్నాయి. ఇవేకాకుండా ఒక చిన్నపాటి కొలను, హెలిక్యాప్టర్ దిగేందుకు వీలుగా ఖాళీ స్థలం జపావో ద్వీపం ప్రత్యేకతలు.
బ్రెజిల్ జట్టులో కీలక ఆటగాడైన నెయ్మర్ పలు క్లబ్స్‌కు ఆడాడు. గతంలో పారిస్ సెయింట్ జర్మనీ(PSG)కి ప్రాతినిధ్యం వహించిన ఈ ఫార్డర్డ్ ప్లేయర్.. ఇప్పుడు సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(Al-Hilal)కు ఆడుతున్నాడు. అయితే.. గాయం కారణంగా ఏడాది పాటు జాతీయ జట్టుకు దూరమ్యాడు.