Solar Storm | త్వరలోనే భారీ సౌర తుఫాను భూమిని తాకనున్నది. ఇది కమ్యూనికేషన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. సూర్యుడి ఉపరితలంపై పేలుళ్లు సంభవిస్తుంటాయి. దాని కారణంగా ఏర్పడే కణాలు, అయస్కాంత క్షేత్రాలు, ఇతర పదార్థాలతో కలిసి అవి భూమి వాతావరణాన్ని తాకుతుంటాయి. దీన్నే సౌర తుఫానుగా పేర్కొంటుంటారు. ఇది ఉపగ్రహాలతో పాటు టెలికమ్యూనికేషన్స్‌కు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంటుందని నాసా పేర్కొంది. ఈ సౌర తుఫానును ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
ఈ క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని భారత ఉపగ్రహ ఆపరేటర్స్‌ని భారతీయ అంతిరక్ష పరిశోధనా సంస్థ అప్రమత్తం చేసింది. సౌర తుఫాను నేపథ్యంలో రాబోయే కొద్దిరోజులు కీలమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ సౌర తుఫాను భారత్‌పై ఎక్కువగా ప్రమాదం ఉండదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ డాక్టర్ అన్నపూర్ణి సుబ్రమణియన్ పేర్కొన్నారు. ఇంతకు ముందు వచ్చిన సౌర తుఫాన్‌తో సమానంగా ఉంటుందని చెప్పారు. తాజాగా వచ్చే తుఫాను భూమిని తాకేందుకు మరికొద్ది రోజుల సమయం ఉందన్నారు. భారత్‌పై పెద్దు ప్రభావం ఉండకపోవచ్చన్న ఆయన.. కొంత సమయం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మే మాసంలోనూ బలమైర సౌర తుఫాను భూమిని తాకిన విషయం విధితమే.