IND Vs SA | టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా కోల్‌కతా టెస్టులో భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించి అద్భుతమైన పునరాగమనం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 30 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కానీ, దక్షిణాఫ్రికా బౌలర్లు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చడంతో.. ఆ జట్టు రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 15 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌కు ఇది తొలి టెస్ట్ ఓటమి. మూడో రోజు, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 153 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 123 పరుగుల ఆధిక్యంలో నిలిచి భారత్‌కు 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. రెండో సెషన్లో 93 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. భారత బ్యాట్స్‌మెన్ ఆటతీరు చాలా చెత్తగా ఉంది. ఆరుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. భారత బ్యాట్స్‌మెన్ సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డారు. రెండు సెషన్లలోనూ పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయారు.
2010 తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్ట్ గెలిచింది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడం దక్షిణాఫ్రికాకు ప్రత్యేకంగా నిలిచింది. ప్రొటీస్ జట్టు భారత గడ్డపై చివరిసారిగా 2010లో గెలిచింది. ఆ సమయంలో ఆ జట్టు భారత్‌ను ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాత తర్వాత భారత్‌తో ఎనిమిది టెస్టులు ఆడింది. ఇందులో భారత్ ఏడు గెలువగా.. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా ఓటములను అధిగమించి 15 ఏళ్ల తర్వాత విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే టెస్టు మ్యాచుల్లో జట్లు లక్ష్యాన్ని ఛేదించడంలో అరుదుగా విజయం సాధిస్తాయి. ఈ స్టేడియంలో 2004లో దక్షిణాఫ్రికాపై భారత్ 117 పరుగుల లక్ష్యాన్ని సాధించింది.
ఆ తర్వాత ఈ మైదానంలో 100 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని జట్లు సాధించలేకపోయాయి. ఈ మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచులో భారత్‌కు అతిపెద్ద లక్ష్యాన్ని సాధించే అవకాశం లభించింది. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో బోల్తాపడింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయానికి అతిపెద్ద కారణం కెప్టెన్ బావుమా. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు ఆతిథ్య జట్టును అడ్డుకోవడంలో విజయం సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో బావుమా నిలకడగా ఆడి అజేయంగా అర్ధ సెంచరీ సాధించాడు. దాంతో జట్టు 120 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంలో సహాయపడింది. బావుమా దక్షిణాఫ్రికా విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. అతని నాయకత్వంలో 11 టెస్టులు ఆడిన ప్రొటీస్ జట్టు.. అందులో పది మ్యాచులను గెలిచింది.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఆరంభం ఆశించన విధంగా లభించలేకపోదు. ఓపెనర్ జైస్వాల్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయినా, వీరి జోడీ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. టీమిండియా తరఫున సుందర్ మాత్రమే 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఆల్‌రౌండ్ అక్షర్ పటేల్ చివరలో బాగానే అలరించాడు. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విరుకుచుపడ్డాడు. దాంతో టీమిండియా విజయం ఖరారైందని అంతా భావించారు. కొద్దిసేపటికే మరోసారి భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
అక్షర్ పటేల్ వికెట్‌ను కాపాడుకొని క్రీజులో ఉండి ఉంటే టీమిండియా మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది. కానీ, తొందరపడి వికెట్‌ని పోగొట్టుకున్నాడు. అక్షర్ పటేల్‌ను అవుట్ చేసిన అనంతరం కేశవ్ మహరాజ్ సిరాజ్‌ను అవుట్ చేయడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ గిల్ బ్యాట్ చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. టీమిండియా బ్యాట్స్మెన్లలో రవీంద్ర జడేజా (18), ధ్రువ్ జురెల్ (13), రిషబ్ పంత్ (2), కేఎల్ రాహుల్ (1), కుల్దీప్ యాదవ్ (1) పరుగులు చేశారు. బుమ్రా (0) నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు పడగొట్టగా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు కూల్చగా.. ఐడెన్ మార్కరమ్కు ఒక వికెట్ తీశాడు.