KTR | హైదరాబాద్ : ఫలితాలు ఎల్లప్పుడూ మనం చేసే పనిని ప్రతిబింబించకపోవచ్చు.. లేదా మన అంచనాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కానీ ఇలాంటి సందేశాలు మనోధైర్యాన్ని పెంచుతాయని కేటీఆర్ అన్నారు. మద్దతు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి మరింత శక్తి చేకూరాలని, కేటీఆర్ కష్టం వృధా కాదని అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం అనంతరం మద్దతుదారులు పేర్కొన్నారు. ఈ సందేశాలను కేటీఆర్ తన ట్వీట్‌కు జోడించారు.
పరిపాలనలో అసమర్థుడు, ఎన్నికల ప్రక్రియలో అరాచకుడు ఈ ముఖ్యమంత్రి. ఇది కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలకు తోడుగా పోలీసులు, ఎన్నికల కమిషన్ తోడై సాధించిన అక్రమ, అప్రజాస్వామిక విజయం. ఈ అరాచకత్వాన్ని, అక్రమ పొత్తులను, గూండాయిజాన్ని తెలంగాణ సహించదు. మూడు పార్టీలకు ముచ్చెటమలు పట్టేలాగా చేశాం. ఒక ఉప ఎన్ని కోసం ఈ సీఎం ఎనిమిది రోజులు జూబ్లీహిల్స్ గల్లీలు తిరిగేటట్టు చేశాం. ఎన్నికల నిబంధనలు అన్ని ఉల్లంఘించారు. వేలాది ఫేక్ ఓట్లు వేయించుకుంది కాంగ్రెస్. నైతికంగా ఘోరంగా ఓడిపోయారు. పోలింగ్ రోజున కూడా పట్టపగలు మంత్రులు జనాలను ప్రలోభపెట్టి, కాన్వాయ్‌లు వేసుకుని తిరిగారు అని ఓ మద్దతుదారు పేర్కొన్నారు.
మీ స్పష్టత, మీ వేగం, మీ దృక్పథం ఈ ఉప ఎన్నిక కంటే చాలా పెద్దవి. మీ నాయకత్వం మరింత బలోపేతం అవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీ కృషికి మేమందరం గర్విస్తున్నాము. ఓటమి తర్వాత పార్టీతో సంబంధలేని ప్రజలు కూడా బాధపడ్డారు. మీ ప్రయత్నం ఎప్పుడు కూడా వృధా కాకూడదు. ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను తీర్చిదిద్దిన నాయకుడు మీరు. ఈ ఉప ఎన్నికలో చూపించిన కృషి, అంకితభావం.. రాబోయే రోజుల్లో కొత్త ఊపు, బలాన్నిస్తాయి. బీఆర్ఎస్ స్ఫూర్తిపై నమ్మకం పెట్టుకున్న లక్షలాది మంది మీకు మద్దతుగా నిలబడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేయోలాభిషులు పేర్కొన్నారు.
Results may not always reflect the work we put in, or be in line with our expectations
But messages such as these below serve as morale boosters
Thank you all for the support 🙏 pic.twitter.com/V4D6IOanTX
— KTR (@KTRBRS) November 16, 2025