IND Vs SA Test | భారత్-దక్షిణాఫ్రికా మధ్య కోల్‌కతా వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా పోరాడుతున్నది. దక్షిణాఫ్రికా 124 పరుగుల లక్ష్యాన్ని విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టు ఆరు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 27.1 సమయంలో హార్మర్ బౌలింగ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వికెట్ల ముందు దొరికిపోయాడు. వాషింగ్టన్ సుందర్తోకలిసి ఐదో వికెట్‌కు 45 బంతుల్లో 25 పరుగులు చేసి టీమిండియాను విజయం వైపు నడిపిస్తాడని భావిస్తున్న క్రమంలోనే 18 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైతం 30.2 ఓవర్ వద్ద మార్కరమ్ బౌలింగ్‌లో హార్మర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 92 బంతులు ఆడి రెండు ఫోర్ల సహాయంతో 31 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
ప్రస్తుతం టీమిండియా 31 ఓవర్లకు 74 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 50 పరుగుల దూరంలో ఇంకా చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. మూడోరోజు దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ ముందు 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు శుభారంగం లభించలేదు. ఓపెనర్లిద్దరి వికెట్లు కూడా కోల్పోయింది. యశస్వి జైస్వాల్ ఖాతా తెరువకుండానే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ సైతం జాన్సెన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. లంచ్ బ్రేక్ వరకు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లకు 10 పరుగులు చేసింది. ఆ తర్వాత ధ్రువ్ జూరెల్ (13) రిషబ్ పంత్ (2) అవుట్ అయ్యారు.