Multi Starrer | ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లిన పాన్ ఇండియా చిత్రాలు, సీక్వెల్స్, ప్రీక్వెల్స్ హవా కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో మల్టీస్టారర్ సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా టాప్ స్టార్స్ కలిసి కనిపిస్తే ఆ సినిమా రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అలాంటి క్రేజీ కాంబినేషన్లో ఒకటిగా సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కలిసి నటించే సినిమా గత కొన్నాళ్ల క్రితం ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరు లెజెండరీ నటులు కలిసి కనిపించే ఒక ప్రాజెక్ట్ కమల్ హాసన్ నిర్మాణంలో ఉందన్న వార్తలు ఉన్నప్పటికీ, అది కాకుండా మరోసారి వీరి కలయికలో కొత్త సినిమా రాబోతుందన్న ప్రచారం ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం, ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ టేకోవర్ చేసినట్టు స్ట్రాంగ్ టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా, నెల్సన్ ఇప్పటికే రజినీకాంత్ – కమల్ హాసన్ కలయికపై ఒక అనౌన్స్మెంట్ కట్ లేదా కాన్సెప్ట్ వీడియో తరహా విజువల్‌ను సిద్ధం చేస్తున్నాడన్న రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ వెంటనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం మాత్రం తక్కువగా ఉందని సమాచారం. ప్రస్తుతం నెల్సన్ ‘జైలర్ 2’తో పాటు ఇతర కమిట్మెంట్స్లో బిజీగా ఉండగా, తెలుగులో కూడా ఒక సినిమా చేయాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాతే ఈ భారీ మల్టీస్టారర్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అది కేవలం సినిమా మాత్రమే కాకుండా ఒక చరిత్రగా నిలుస్తుందన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై వస్తున్న ప్రతి చిన్న వార్త కూడా భారీ చర్చకు దారి తీస్తోంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ కేవలం రూమర్స్‌గానే ఉండగా, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.