IND vs PAK : ఆసియా కప్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మరికొన్ని నిమిషాల్లో మొదలవ్వనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా (Salman Agha) బ్యాటింగ్ తీసుకున్నాడు. వికెట్ స్లోగా ఉన్నందున సాధ్యమైనన్ని పరుగులు చేసి టీమిండియాను నిలువరించాలని భావిస్తున్నట్టు సల్మాన్ తెలిపాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మొదట బౌలింగ్ చేయడం సంతోషకరమే అని చెప్పాడు. పిచ్ స్లోగా ఉన్నప్పటి తేమ ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నాని మిస్టర్ 360 తెలిపాడు.
గ్రూప్ దశలో చెరొక విజయం సాధించి సూపర్ 4పై కన్నేసిన ఇరుజట్లకు ఇది కీలమైన మ్యాచ్. కాబట్టి.. ఏ మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నట్టు సూర్యకుమార్ యాదవ్, పాక్ కెప్టెన్ సల్మాన్ వెల్లడించారు. రాత్రి 8 గంటలకు తొలి బంతి పడనుంది.
Both teams are unchanged as a new generation of India and Pakistan players come together
🔗 https://t.co/8SfVm5zPAQ pic.twitter.com/b79bZFT0s7
— ESPNcricinfo (@ESPNcricinfo) September 14, 2025
భారత్ తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్థాన్ తుది జట్టు : షహిబ్జద ఫర్హాన్, సయీం ఆయూబ్, మొహమ్మద్ హ్యారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫహీం అష్రఫ్, షాహీన్ ఆఫ్రిది, సూఫియన్ మకీం, అబ్రార్ అహ్మద్.