World Athletics Championships : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత హై జంపర్ సర్వేశ్ కుశారే (Sarvesh Kushare) చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో సత్తా చాటుతూ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. టోక్యో ఒలింపిక్స్ విజేత గియన్మార్కో తంబేరి (Gianmarco Tamberi)ని వెనక్కి నెట్టిసి పతకానికి మరింత చేరువయ్యాడు. తద్వారా భారత్ నుంచి ఈ విభాగంలో ఫైనల్ చేరిన తొలి పురుష అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు సర్వేశ్.
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సర్వేశ్ కుశారే కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో తన బలాన్నంతా కూడదీసుకొని జంప్ చేశాడు. ఫైనల్ అర్హతకు నిర్ధేశించిన 2.16 మీటర్ల ఎత్తు దూకడంలో తొలి ప్రయత్నంలో విఫలం అయినప్పటికీ.. ఒత్తిడికి లోనవ్వలేదు సర్వేశ్. రెండో ప్రయత్నంలో 2.2 5 మీటర్ల ఎత్తు దుమికి ఫైనల్ బెర్తు సాధించాడు. సర్వేశ్‌తో కలిపి 13 మంది ఫైనల్ బెర్తు సొంతం చేసుకున్నారు. పతక వేటలో భారత స్టార్ మెరుగైన ప్రదర్శన చేయాలని యావత్ భారతం కోరుకుంటోంది.
Sarvesh Kushare clears 2.16m in the men’s High Jump qualification!
Competing in his second World Championships and a season best of 2.26m, can he soar into the final in Tokyo? 🏟️
Drop your predictions in the comments and stand a chance to win exciting prizes. #Athletics… pic.twitter.com/hw2S8fdkUS
— nnis Sports (@nnis_sports) September 14, 2025