Britan Boxer Died : బ్రిటన్ బాక్సింగ్ దిగ్గజం రికీ హాటన్ (Ricky Hatton) కన్నుమూశాడు. ఈ డిసెంబర్లో రింగ్‌లోకి పునరాగమనం చేయాలనుకున్న ఆయన హఠాత్తుగా మరణించాడు. మాజీ వరల్డ్ ఛాంపియన్ అయన రికీ 46 ఏళ్లకే తుది శ్వాస విడువడంతో కుటుంబసభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. రీ ఎంట్రీకి మ్యాచ్ సన్నద్ధలో ఉన్న రికీ మరణంపై మాంచెస్టర్ పోలీసులు స్పందించారు. ఉత్తర ప్రాంతంలోని హైడే ఏరియాలో ఆదివారం ఉదయం రికీ మృతదేహం లభించింది. ఆయన మరణం అనుమానాస్పందంగా అనిపించడంలేదు. పోస్ట్ మార్టం తర్వాత రికీ మృతికి దారితీసిన కారణాలు బయటకొస్తాయి అని తెలిపారు.
తన సూపర్ పంచ్‌లతో హిట్ మ్యాన్ అనే పేరు గడించిన రికీ హాటన్.. సుదీర్ఘ కెరీర్లో చాలా టైటిళ్లు గెలుపొందాడు. అతడు రింగ్‌లోకి దిగాడంటే ప్రత్యర్థులకు దడ పుట్టేంది. ఎదురైన వాళ్లనల్లా అలవోకగా మట్టికరిపిస్తూ.. అజేయంగా దూసుకెళ్తున్న లెజెండ్ కొస్త్యా సుజుస్( రష్యా ఆస్ట్రేలియా ప్రొఫెషనల్ బాక్సర్)కు ఓటమి రుచి చూపించింది ఈయనే. 2005లో రికీ తన దూకుడైన ఆటతో సుజుస్ జైత్రయాత్రకు తెరదించాడు. అక్కడితో మొదలైన ఆయన విజయ ప్రస్థానం 2007 వరకూ కొనసాగింది.
British boxing icon Ricky Hatton has died at the age of 46.
The multi-time world champion leaves behind a fantastic legacy.
Rest in peace. pic.twitter.com/O0qz2uw4Ia
— talkSPORT (@talkSPORT) September 14, 2025
రెండేళ్లుగా తిరుగులేని విజేతగా అవతరించాడు రీకీని లాస్ వేగాస్‌లో అమెరికా బాక్సర్ ఫ్లాయిడ్ మెవేదర్ జూనియర్ ఓడించాడు. ఆ తర్వాత ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న రికీ ఐదేళ్లకు బాక్సింగ్‌కు వీడ్కోలు పలికాడు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. నేను చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్ని బాక్సింగ్ నాకు తాగుడు అలవాటు ఉండేది. అది కాస్త డ్రగ్స్‌కు దగ్గర చేసింది. దాంతో, నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది అని గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రికీ వెల్లడించాడు.
Today we lost not only one of Britain’s greatest boxers, but a friend, a mentor, a warrior, Ricky Hatton.
As fighters, we tell ourselves we’re strong — we train, we sweat, we take hits, we get up. But sometimes the hardest fight happens in silence, in the mind. Mental health… pic.twitter.com/JwSaYJe6XE
— Amir Khan (@amirkingkhan) September 14, 2025
‘ఈరోజు మనం బ్రిటన్ బాక్సింగ్ దిగ్గజాన్ని మాత్రమే కాదు కోల్పోలేదు. ఒక స్నేహితుడు, మెంటార్, పోరాట యోధుడిని మిస్ అయ్యాం. రికీ నీ విలువైన సలహాలు, స్ఫూర్తినిచ్చే పోరాటాలు అన్నింటికీ కృతజ్ఞతలు. మమ్మల్ని ప్రోత్సహించి.. మాతో అసాధ్యాలను సైతం సాధ్యం చేయించినందుకు ధన్యవాదాలు’ అని రికీ మృతిపట్ల బ్రిటన్ యువ బాక్సర్ తన ట్వీట్లోఅమిర్ ఖాన్ (Amir Khan) సంతాపం తెలిపాడు.