Andhra Team : దేశవాళీ క్రికెట్లో రంజీ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఆంధ్ర క్రికెట్ సంఘం కీలక నియామకాలతో కోచింగ్ బృందాన్ని పటిష్టం చేసుకుంది. ప్రధాన కోచ్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్యారీ స్టీడ్(Gary Stead)ను ఎంచుకున్న ఏసీఏ.. బ్యాటింగ్ కోచ్‌ను ఖరారు చేసింది. ఆదివారం ముంబై దిగ్గజం వినీత్ ఇడుక్కర్ (Vinit Idulkar)ను బ్యాటింగ్ కోచ్గానియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మాజీ ఆటగాడు ఇప్పటికే ఆంధ్ర స్క్వాడ్‌తో కలిశాడు. ప్రస్తుతం కర్నాటక క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో మైసూర్లో జరుగుతున్న టోర్నమెంట్‌తో అతడి కోచింగ్ జర్నీ ప్రారంభం కానుంది.
‘దేశవాళీ క్రికెట్లో ముంబై ఆధిపత్యం చెలాయించడంలో ఇడుక్కర్ పాత్ర ఎనలేనిది. సహాయక సిబ్బందిగా ఆయన అందించిన సేవలు అపూర్వం. నిరుడు ఆయన బ్యాటింగ్ సూచనలతో ముంబై జట్టు రంజీ సెమీఫైనల్ చేరింది. అనంతరం జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుపొందింది. అందుకే.. అనుభవజ్ఞుడైన అతడి సేవలు ఆంధ్ర జట్టుకు ఉపయోగపడుతాయని నమ్ముతున్నాం’ అని ఏసీఏ వెల్లడించింది.
ఆంధ్ర జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికఫస్ట్ క్లాస్ కెరీర్లో 43 మ్యాచ్లువ్వడం పట్ల ఇడుక్కర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఏసీఏతో చర్చలు, ఒప్పందం పూర్తయ్యాక మీడియాతో మాట్లాడుతానని చెప్పిన ఇడుక్కర్.. మైసూర్ బయల్దేరుతున్నాను అని క్రిక్‌బజ్‌తో తెలిపాడు. రంజీ ఛాంపియన్ ముంబైకి ఇడుక్కర్ కొన్నాళ్లుగా కోచింగ్ ఇస్తున్నాడు. అయితే.. 2025-26 సీజన్ ముందు అతడితో కాంట్రాక్ట్ రద్దు చేసుకుంది ముంబై క్రికెట్ సంఘం. దాంతో.. ఇడుక్కర్ సేవల్ని వినియోగించుకోవాలని ఆంధ్ర క్రికెట్ సంఘం రంగంలోకి దిగింది. ఈ మాజీ క్రికెటర్ 16 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 43 మ్యాచ్‌లు ఆడాడు.