ICC : ప్రపంచ క్రికెట్లో కొత్త చరిత్రకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నాంది పలికింది. ఇప్పటికే పురుషుల క్రికెటర్లతో సమానంగా మహిళలకు వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ మరో కీలక నిర్ణయంతో ముందుకొచ్చింది. మహిళల చాంపియన్స్ ట్రోఫీ (Womens Champions Trophy) నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. అంతేకాదండోయ్.. తొలి సీజన్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఈ మెగా టోర్నీలో ఆరు జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.
మహిళల చాంపియన్స్ ట్రోఫీ 2027లో శ్రీలంక వేదికగా జరుగనుంది. జూన్ – జూలై నెలల మధ్య ఈ టోర్నీ అభిమానులను అలరింనుంది. ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ టోర్నీలో ఆరు జట్లు ఢీ కొననున్నాయి. వాటి మధ్య 16 మ్యాచ్‌లు నిర్వహిస్తామని ఐసీసీ తెలిపింది.
The first edition of the ICC Women’s Champions Trophy has been confirmed for June-July 2027 in Sri Lanka, with six teams set to compete in the new T20 tournament 🏆
Read more: https://t.co/aEk6s3AcDV pic.twitter.com/T0k6eze9qG
— ESPNcricinfo (@ESPNcricinfo) November 4, 2024
అయితే.. తొలి సీజన్లో ఆడే ఆ ఆరు జట్లు ఏవనేది ఐసీసీ ఇంకా వెల్లడించలేదు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌తో పాటు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకొని టీమ్‌లను ఎంపిక చేస్తారని సమాచారం. అయితే.. త్వరలోనే టోర్నీ ఆరంభ వేడుకల తేదీతో పాటు.. టైటిల్ పోరు తేదీ సహా ఇతర వివరాలను త్వరలోనే ఐసీసీ స్పష్టం చేయనుంది.