Coco Gauff : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. నెలల తరబడి కొనసాగిన ప్రచార పర్వం, డిబేట్లు ముగియడంతో నవంబర్ 5వ తేదీన ఓటింగ్ జరుగనుంది. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన పలువురు సినీ తారలు, క్రీడాకారులు ఓటు వేశారు. ఆ దేశ టెన్నిస్ సంచలనం కొకో గాఫ్(Coco Gauff) సైతం తన బాధ్యతను మర్చిపోలేదు. ఆమె ముందస్తుగా తన ఓటు హక్కును వినియోగించుకుంది. తాను ఓటు వేయడమే కాదండోయ్ యువతరాన్ని తమ బాధ్యతను నిర్వర్తించాల్సిగా కోరుతోంది.
నేను గతంలో ఓటు వేశాను. స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నా. కానీ, తొలిసారి ఇప్పుడే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేశాను. మీరు కూడా ఓటేసి కూల్ అవ్వండి. నేను చేయగలిగిందల్లా యువతను ప్రోత్సహించడమే. ముఖ్యంగా యువతను ఓటు వేసిలా చేసి, వాళ్లు తమ హక్కును వినియోగించేలా చేయాలనుకుంటున్నా. మా తరంలోని చాలామంది ఓటుకు ఉన్న శక్తి తెలియదు. నేనేతే ఓటేశానోచ్ అని గాఫ్ తెలిపింది.
Coco Gauff: It’s a crucial time for our country right now. All I can do is encourage ppl, especially young ppl, to vote & use their voice. Especially in my generation, there’s a lot of ppl who don’t see the power of voting. For me, I do.
More from Gauff: https://t.co/T3508IJcQP pic.twitter.com/gYVHOjonTu
— Reem Abulleil (@ReemAbulleil) November 3, 2024
సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ తర్వాత అమెరికా టెన్నిస్‌లో సంచలనంగా మారిన గాఫ్.. 2023లో యూఎస్ ఓపెన్ విజేతగా చరిత్ర సృష్టించింది. అనంతరం 2024లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఇగా స్వియాటెక్‌ను చిత్తు చేసి మరో గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకుంది. తన ఆటతో అదరగొడుతున్న ఈ టీనేజరర్ ఇప్పటివరకూ 7 డబ్ల్యూటీఏ టూర్ సింగిల్స్ ట్రోఫీలు కొల్లగొట్టింది.
Coco Gauff is the first woman to reach 3 consecutive WTA Finals before the age of 21 since Maria Sharapova.
Sharapova (2004 – 2007)
Gauff – (2022 – 2024) pic.twitter.com/5ESmBGWoRC
— The Tennis Letter (@TheTennisLetter) November 3, 2024
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ రెండోసారి రేసులో నిలవగా.. డెమోక్రాట్స్ తరఫు నుంచి భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ బరిలో ఉంది. మాజీ ప్రెసెడింటె జో బైడెన్ పోటీ నుంచి వైదొలగడంతో నామినేట్ అయిన కమల.. ట్రంప్ హామీలను, విధానాలను తప్పుబడుతూ ప్రచారంలో, చర్చాగోష్టిలో పైచేయి సాధించింది. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఆ తర్వాత అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరనేది ప్రకటిస్తారు.