Anushka – Ghaati | గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది నటి అనుష్క శెట్టి. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో వరుస ప్రాజెక్ట్‌లను ఒకే చేస్తుంది ఈ భామ. ఇప్పటికే మలయాళం కథనార్ అనే సినిమాతో పాటు తెలుగులో భాగమతి సీక్వెల్ సినిమాలో నటిస్తున్న ఈ భామ వేదం(Vedam) దర్శకుడు క్రిష్‌తో ఘాటి(Ghaati) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 4 ఏండ్ల ముందు మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చివరిదశకు చేరుకుంది.
ఇప్పటికే 90% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మరో నాలుగు రోజుల్లో గుమ్మడికాయ కూడా కొట్టబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. అయితే నవంబర్ 07 అనుష్క శెట్టి బర్త్‌డే. ఈ సందర్భంగా మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. కొండపోలం వంటి డిజాస్టార్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తుంది.
The queen is coming back to rightfully reclaim her throne 👑
4 days to go for the birthday of The Queen, #AnushkaShetty, and the same 4 days to wrap up #GHAATI‘s shooting journey ❤️🔥
Circle your calendars for November 7th as we celebrate with a special glimpse into the world of… pic.twitter.com/QZ2AAB6taF
— UV Creations (@UV_Creations) November 4, 2024