PM Narendra Modi | కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ నిప్పులు చెరిగారు. ఏనాడూ గిరిజనులను గౌరవించలేదని ఆరోపించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల గౌరవం, హుందాతనానికి నిలువెత్తు సాక్షి జార్ఖండ్, భారత స్వాతంత్ర్యం, సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటంలో గిరిజనుల ధైర్య సాహసాలే కీలక పాత్ర పోషించాయన్నారు.
‘గిరిజనులకు ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్), కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద శత్రువులు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఆ పార్టీలకు జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా) మద్దతు పలుకుతుంది’ అని మోదీ ఆరోపించారు. ‘గిరిజనులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాల్చి చంపింది. నిరంకుశ ఇంగ్లిష్ పాలకులకు కొల్హాన్ విసిరిన సవాల్‌కు చరిత్రే సాక్షి. ఈనాడు నిరంకుశ జేఎంఎం- కాంగ్రెస్- ఆర్జేడీ కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కొల్హాన్ మరోసారి సిద్ధమైంది’ అని వ్యాఖ్యానించారు.