Womens T20 World Cup : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన టీమిండియా సెమీస్ లక్ష్యంగా శ్రీలంకతో తలపడనుంది. ఇకపై ప్రతి మ్యాచ్ గెలవాల్సిన దశలో భారత జట్టుకు షాకింగ్ న్యూస్. పాకిస్థాన్‌పై సూపర్ బౌలింగ్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న పేసర్ అరుంధతీ రెడ్డి(Arundhati Reddy)ని ఐసీసీ మందలించింది. దాయాదితో మ్యాచ్ సందర్భంగా పేసర్ ఐసీసీ నియమావళిని ఉల్లంఘించింది. ఈ విషయమై రిఫరీ ఫిర్యాదు చేయగా.. అరుంధతీ కూడా తన తప్పును అంగీకరించింది. దాంతో, ఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.
పాకిస్థాన్‌తో ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో అరుంధతీ రెడ్డి బంతితో మెరిసింది. 4 ఓవర్లలో 19 పరుగులకే మూడు కీలక వికెట్లు తీసింది. 20వ ఓవర్లో నిదా దార్(23)ను బౌల్డ్ చేసిన ఈ స్పీడ్‌స్టర్ భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయింది. పెవలియన్ అటు అంటూ నిదాకు చూపిస్తూ వికెట్ సెలట్రేట్ చేసుకుంది. అరుంధతీ తీరును తప్పుబట్టిన రిఫరీ ఆమె లెవల్ 1 కోడ్ ఉల్లంఘనకు పాల్పడిందని ఫిర్యాదు చేశాడు. దాంతో.. క్రమశిక్షణ కమిటీ ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. ఇదే సీజన్లో మరో మూడు డీ మెరిట్ పాయింట్లు వస్తే.. అరుంధతిపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది.
Arundhati Reddy 🔥🔥 pic.twitter.com/VWZcrNHfmW
— Suresh Kumar (@SureshK84102899) October 6, 2024
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో దారుణ ఓటమి. రెండో మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే తప్ప సెమీస్ చేరే అవకాశం లేదు. ఏరకంగా చూసినా టీమిండియాకు చావోరేవో మ్యాచ్. అలాంటి మ్యాచ్‌లో అరుంధతీ రెడ్డి(3/19)తో చెలరేగింది. దాంతో, చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన భారత అమ్మాయిలు.. అతికష్టమ్మీద గట్టెక్కారు.
#ArundhatiReddy‘s 🇮🇳 3/19 was instrumental in the #GreatestRivalry against #Pakistan 🇵🇰! 🔥
What a performance and night to remember! 💙
Watch #TeamIndia in action next 👉 #INDvSL in #WomensWorldCuponStar | WED, 9 OCT, 7 PM! #HerStory pic.twitter.com/oGXHDPX0yz
— Star Sports (@StarSportsIndia) October 6, 2024
ఓపెనర్ షఫాలీ వర్మ(32), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(29)ల అద్భుత పోరాటంతో ఆదుకున్నారు. మిడిల్ ఓవర్లలో జెమీమా రోడ్రింగ్స్(23) కీలక ఇన్నింగ్స్ ఆడింది. విజయానికి రెండు పరుగులు అవసరం అనగా హర్మన్‌ప్రీత్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరినా.. సజన(4) లాంఛనం పూర్తి చేసింది. ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించిన టీమిండియా సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.