Maa Nanna Superhero | టాలీవుడ్ యాక్టర్ సుధీర్‌బాబు (Sudheer Babu) నటిస్తోన్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero). ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుంది. ‘లూసర్’ వెబ్‌సిరీస్ ఫేం అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా సుధీర్ బాబు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
సినిమా గురించి మాట్లాడుతూ.. మా నాన్న సూపర్ హీరో యూనివర్సల్ సబ్జెక్ట్ అని అన్నాడు సుధీర్ బాబు. కథ ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమాలోని భావోద్వేగాలకు ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారని నమ్ముతున్నానన్నాడు సుధీర్ బాబు.
ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్, సీఏఎమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీలో సాయిచంద్, షాయాజీషిండే, రాజు సుందరం, శకాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి జై క్రిష్ సంగీతం అందిస్తుండగా.. సునీల్ బలుసు తెరకెక్కిస్తున్నారు. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు.
Read Also :
Chiranjeevi | పాపులర్ టూరిజం స్పాట్లో ఖరీదైన ప్రాపర్టీ కొన్న చిరంజీవి..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
Good Bad Ugly | అజిత్‌కుమార్‌తో సునీల్ సెల్ఫీ.. ఇంతకీ ఎక్కడున్నారో మరి..!
Amaran | అమరన్ నుంచి శివకార్తికేయన్-సాయిపల్లవి హే రంగులే లిరికల్ సాంగ్