Amaran | కోలీవుడ్ స్టార్ యాక్టర్లు శివకార్తికేయన్ (Sivakarthikeyan)-సాయిపల్లవి కాంబోలో వస్తున్న చిత్రం అమరన్ (Amaran). SK21గా వస్తున్న ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహిస్తున్నాడు. అమరన్‌లో సాయిపల్లవి మేజర్ ముకుంద్ సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అమరన్ నుంచి హే రంగులే రిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే అంటూ సాగుతున్న ఈ పాట శివకార్తికేయన్, సాయిపల్లవి మధ్య ఇంప్రెసివ్ కెమిస్ట్రీతో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడారు. ఈ సాంగ్ జీవీ ప్రకాశ్‌కుమార్ కంపోజిషన్‌లో వచ్చిన 700వ పాట కావడం విశేషం.
మేజర్ ముకుంద్ జీవితంలో పలు కోణాలను ఆవిష్కరిస్తూ అమరన్ ఉండబోతుందని ఇప్పటివరకు విడుదల చేసిన రషెస్ చెబుతున్నాయి.
మేకర్స్ ఇప్పటికే రెబెకా వర్గీస్ పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను షేర్ చేశారని తెలిసిందే. ఈ చిత్రంలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని కథానుగుణంగా ఎక్కువ భాగం కశ్మీర్లో 75 రోజులపాటు పూర్తి చేశారు.
హే రంగులే లిరికల్ సాంగ్..
Read Also :
Chiranjeevi | పాపులర్ టూరిజం స్పాట్లో ఖరీదైన ప్రాపర్టీ కొన్న చిరంజీవి..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
Committee Kurrollu | సెలబ్రేషన్స్ టైం.. కమిటీ కుర్రోళ్లు ఖాతాలో అరుదైన పురస్కారం
Siddu Jonnalagadda | జాక్ షూట్ గురించి చెప్పిన సిద్ధు జొన్నలగడ్డ
అమరన్ ఇంట్రో..