Harmanpreet Kaur : భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) ముంబైలో ప్రసిద్దమైన సిద్దివినాయకుడి(Siddi Vinayaka)ని దర్శించుకుంది. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌కు ముందు హెడ్ కోచ్ అమోల్ మజుందార్(Amol Majumdar)తో కలిసి గణేశుడిని ఆలయానికి వెళ్లింది. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హర్మన్‌ప్రీత్, మజుందార్ వినాయకుడి సన్నిధిలో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Harmanpreet Kaur and Amol Majumdar take the blessings of Ganpati Bappa at Siddhivinayak Temple in Mumbai 🙏#HarmanpreetKaur #AmulMajumdar #CricketTwitter pic.twitter.com/wa7SKgnJha
— InsideSport (@InsideSportIND) December 26, 2023
సొంత గడ్డపై హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై అద్భుత విజయాలు సాధించింది. తొలుత ఇంగ్లండ్‌ను 347 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. ముంబైలోని వాంఖడేలో ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా కంగారూలపై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసింది. వన్డే సిరీస్ డిసెంబర్ 8న మొదలవ్వనుంది. ఇప్పటికే బీసీసీఐ రెండు సిరీస్‌ల కోసం15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.