David Warner: స్టీవ్ వాను దాటేసిన డేవిడ్ వార్నర్
David Warner : డేవిడ్ వార్నర్ పేరిట కొత్త రికార్డు నమోదు అయ్యింది. ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు సాధించిన రెండవ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను మాజీ కెప్టెన్ స్టీవ్ వాను దాటేశాడు. నెంబర్ వన్ రన్ స్కోరర్ స్థానంలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు.
మెల్బోర్న్: ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) కొత్త మైలురాయి చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు సాధించిన రెండవ బ్యాటర్‌గా నిలిచాడతను. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ స్టీవ్ వాను అతను దాటేశాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అతను ఆ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు వార్నర్ 371 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. దాంట్లో అతను 42.56 సగటుతో 18, 515 రన్స్ చేశాడు. అతని కెరీర్లో 49 సెంచరీలు, 93 ఫిఫ్టీలు ఉన్నాయి.
ఆస్ట్రేలియా తరపున స్టీవ్ వా అంతర్జాతీయ క్రికెట్లో 18,496 రన్స్ చేశాడు. అతను 493 మ్యాచ్‌లు ఆడాడు. 41.65 సగటుతో అతను స్కోర్ చేశాడు. స్టీవ్ వా ఇన్నింగ్స్‌లో 35 సెంచరీలు, 95 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాక్‌తో జరిగిన రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన వార్నర్.. మాజీ బ్యాటర్ స్టీవ్ వా పేరిట ఉన్న మైలురాయిని దాటేశాడు.
మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా తరపున అత్యధిక రన్స్ చేశాడు. అతను 45.84 సగటుతో 27,368 రన్స్ చేశాడు. పాంటింగ్ తన కెరీర్లో 559 మ్యాచ్‌లు ఆడాడు. దాంట్లో 70 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

