Harmanpreet Kaur : అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్న భారత మహిళల జట్టు టీ20 వరల్డ్ కప్ కలను నిజం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. మెగా టోర్నీ కోసం బెంగళూరులో టీమిండియా 10 రోజుల క్యాంప్‌లో కఠోర సాధన చేస్తోంది. ఈమధ్యే ఆసియా కప్‌లో ట్రోఫీ చేజార్చుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) సేన పొట్టి ప్రపంచకప్ ముందు మానసిక సన్నద్ధతపై దృష్టి పెట్టింది. ఇదే విషయాన్ని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మీడియా సమావేశంలో వెల్లడించింది.
అందరూ టీ20 ఫార్మాట్ అనగానే.. చాలా చిన్నది అనుకుంటారు. కానీ, ఒక రోజులో మేము 40 ఓవర్లు ఆడుతాం. ఈ ఫార్మాట్లో ఆఖరి 4-5 ఓవర్లు చాలా కీలకం. ఈ ఓవర్లలో మానసికంగా ధ్రుఢంగా ఉన్న జట్టునే విజయం వరిస్తుంది. గత కొన్ని ఏండ్లుగా మేము మానసికంగా బలంగా ఉండడంపై సాధన చేస్తాం. ఇంతకుముందులా ఒత్తిడికి తలొగ్గము అని హర్మన్‌ప్రీత్ తెలిపింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా టైటిల్ కోసం నిరీక్షిస్తూనే ఉంది. 2020లో ఫైనల్ చేరినా ఒత్తిడికి లోనై ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడి విశ్వ విజేత అయ్యే అవకాశం చేజార్చుకుంది.
𝗠𝗮𝗿𝗸 𝗬𝗼𝘂𝗿 𝗖𝗮𝗹𝗲𝗻𝗱𝗮𝗿 🗓️#TeamIndia‘s schedule for the ICC Women’s #T20WorldCup 2024 is 𝙃𝙀𝙍𝙀 🔽 pic.twitter.com/jbjG5dqmZk
— BCCI Women (@BCCIWomen) August 26, 2024
అంతేకాదు 2022 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ మళ్లీ టీమిండియాకు ఆసీస్ చెక్ పెట్టింది. అప్పుడు 9 పరుగుల తేడాతో ఓటమి ఎదురైంది. తాజాగా ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక హర్మన్‌ప్రీత్ సేనకు షాకిచ్చి తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఈ అనుభవాల నుంచి పాఠం నేర్చుకుంటేగానీ భారత మహిళల జట్టు టీ20 వరల్డ్ కప్ కల నిజం కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. టీ20 వరల్డ్ కప్ ఈసారి యూఏఈ వేదికగా అక్టోబర్ 3న మొదలవ్వనుంది. అక్టోబర్ 4వ తేదీన న్యూజిలాండ్‌తో, ఆ తర్వాత అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.