Hardhik Pandya : పొట్టి వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) సొంత ఇలాకాలో అడుగుపెట్టాడు. బార్బడోస్ నుంచి స్వదేశం వచ్చాక ముంబైలోనే ఉండిపోయిన పాండ్యా మంగళవారం బరోడా (Baroda)కు వెళ్లాడు. ఊహించిన దానికంటే రెట్టింపుగా ఈ స్టార్ ఆల్‌రౌండర్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సోదరుడు కృనాల్ పాండ్యా (Krunal Pandya)తో కలిసి పాండ్యా ఓపెన్ టాప్ బస్సులో రోడో షో పాల్గొన్నాడు.
ఓపెన్ టాప్ బస్సులో ఊరేగిన పాండ్యాకు జనం నీరాజనాలు పలికారు. దారి పొడవునా వరల్డ్ కప్ హీరోకు వెల్కమ్ చెప్తూ హార్దిక్, కృనాల్‌లతో ఫొటోలు తీసుకున్నారు. అంతమంది తనపై చూపిస్తున్న ఆదరణ, ప్రేమకు ఫిదా అయిన పాండ్యా వాళ్లకు థాంక్యూ చెప్పాడు.
Surreal ❤️ Thank you for all the love Baroda, thank you for the support and thank you for making this such a special day. So many emotions, but always grateful. 🙏🇮🇳 pic.twitter.com/PJ12bBUnjH
— hardik pandya (@hardikpandya7) July 16, 2024
టీ20 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండర్‌గా విశేషంగా రాణించిన పాండ్యా.. ఫైనల్లోనూ కెప్టెన్‌తో పాటు కోట్లాదిమందిని గెలిపించాడు. 20వ ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమైన వేళ బంతి అందుకున్న పాండ్యా.. తొలి బంతికే డేంజరస్ డేవిడ్ మిల్లర్ వికెట్ తీసి జట్టును గెలుపు వాకిట నిలిపాడు. ఒత్తిడిలోనూ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అదరహో అనిపించాడు. అంతేకాదు ఐపీఎల్ 17వ సీజన్లో తనను ఛీ కొట్టిన వాళ్లకు పాండ్యా గట్టి సమాధానం చెప్పాడు.

శ్రీలంకతో జరుగబోయే టీ20 సిరీస్‌కు పాండ్యా కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశ ముంది. అయితే.. ఆగస్టు 2న మొదలయ్యే వన్డే సిరీస్‌కు అతడు దూరమవుతాడని సమాచారం. వ్యక్తిగత కారణాలతో పాండ్యా సిరీస్ నుంచి వైదొలనున్నాడని టాక్.
For all of India, for all the work we’ve put over years and years. There are no words, there are only emotions! Love this team, love playing for my country! No greater joy than winning for my country! Champions of the world 🇮🇳🇮🇳🇮🇳🏆🏆 Jai Hind! pic.twitter.com/TZTbW6i4gK
— hardik pandya (@hardikpandya7) June 29, 2024