మొయినాబాద్, డిసెంబర్25 : గుర్తు తెలియని దుండగులు ఇంటిముందు పార్కింగ్ చేసిన మూడు కార్లపై(cars) దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మొయినాబాద్ మండల పరిధిలోని అండాపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంటిముందు పార్కింగ్ చేసిన మూడు కార్లపై దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన బూర్గు ప్రభాకర్ రెడ్డికి చెందిన బెలోనో కారు, సామ అవినాష్ రెడ్డి కి చెందిన బ్రీజా కారు, తూర్పు అఖిల్ రెడ్డికి సంబంధించిన క్రెటా కారు తమ ఇండ్ల ముందు పార్కింగ్ చేశారు.
గుర్తు తెలియని దుండగులు బుధవారం అర్ధరాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేసిన కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. అదేవిధంగా తెలుగు శ్రీశైలం కు సంబంధించిన ఐ20 కారు బాధితులు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గురువారం ఉదయం గ్రామానికి చేరుకొని దుండగులను గుర్తించేందుకు సీసీ ఫుటేజ్ లను సేకరిస్తున్నారు. ఇద్దరు యువకులు ముఖానికి మంకీ క్యాపులు ధరించి ఒక బైక్ పై వచ్చి కార్లను ధ్వంసం చేసినట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.