IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) దుమ్మురేపుతోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అంతేకాదు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ హోల్డర్స్ కూడా ఆ జట్టు ఆటగాళ్ల చెంతనే ఉన్నాయి. ఇప్పటికే 8 మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించిన గిల్ సైన్యం.. తదుపరి రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం తమ సొంత ఇలాకాకు చేరుకున్న గుజరాత్ ఆటగాళ్లు దైవదర్శనం చేసుకున్నారు.
పురాతనమైన హత్కేశ్వర్ ఆలయం(Hatkeshwar Temple)లో పూజలు చేశారు. ఈ సందర్భంగా గుడి పూజారులు క్రికెటర్లను సత్కరించి.. జ్ఞాపికలు అందజేశారు. 18వ సీజన్లో విజయం సిద్ధించాలని హత్కేశ్వర్ గుడిని సందర్శించి.. ఆ శివయ్య ఆశీర్వాదం తీసుకున్నాం అనే క్యాప్షన్‌తో గుజరాత్ యాజమాన్యం ఎక్స్ ఖాతాలో ఫొటోలు పెట్టింది. కెప్టెన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్, వికెట్ కీపర్ జోస్ బట్లర్ సహ పలువురు ఆటగాళ్లు ఉన్న ఈ వీడియో పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.
Seeking blessings for the season at Hatkeshwar Temple 🌼🙏 pic.twitter.com/TauCqEiGlC
— Gujarat Titans (@gujarat_titans) April 24, 2025
గుజరాత్‌లోని ప్రసిద్ధ దేవాలయాల్లో హత్కేశ్వర్ గుడి ఒకటి. 17వ శతాబ్దంలో మరాఠా నాయకులు దీన్ని నిర్మించారు. ఇక్కడ శివుడు స్వయంభువుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి శివయ్య గుజరాత్‌లోని నగర్ బ్రాహ్మణులకు ఇష్టమైన దైవం. జాతీయ వారసత్వ సంపదగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది. హత్కేశ్వర్ దేవాలయం వాస్తు, శిల్ప కళలో మరాఠా, సోలంకీ రాజుల కాలం నాటి ఆనవాళ్లు కనిపిస్తాయి.
Our Titans visited the majestic Kirti Toran, an architectural marvel standing tall since the 12th century 🤩 pic.twitter.com/qJuM4vExiL
— Gujarat Titans (@gujarat_titans) April 24, 2025
పదిహేడో సీజన్లో హార్దిక్ పాండ్యా ముంబైకి మారడంతో గుజరాత్ పగ్గాలు అందుకున్న గిల్.. కెప్టెన్‌గా మెరుగయ్యాడు. 18వ సీజన్లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో అలరిస్తూ జట్టుకు కొండంత అండగా నిలుస్తున్నాడు. ఈ సీజన్లో చెలరేగి ఆడుతున్న ఓపెనర్ సాయి సుదర్శన్(Sai Sudarshan) 417 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ అట్టిపెట్టుకోగా.. పేసర్ ప్రసిధ్ కృష్ణ 16 వికెట్లతో పర్పుల్ క్యాప్ సాధించాడు. వీళ్లిద్దరూ ఇదే జోరు చూపిస్తే టోర్నీ ముగిసేసరికి విజేతలుగా నిలిచే అవకాశముంది. ఏప్రిల్ 28వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది.
Orange Cap 🤝 Table toppers 🤝 Purple Cap pic.twitter.com/AFTh5sc4mn
— Gujarat Titans (@gujarat_titans) April 21, 2025