IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో అట్టడుగున ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్(SHR) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ప్రతి మ్యాచ్ గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను ఆరెంజ్ ఆర్మీ ఢీ కొట్టనుంది. చెపాక్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. గెలుపొందిన జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్టే.
కాబట్టి.. టర్నింగ్ పిచ్‌తో స్వాగతం పలికే సీఎస్కేను.. సన్‌రైజర్స్ టాపార్డర్ దెబ్బకొడతారా? లేదా నిలకడలేమిని కొనసాగిస్తూ తోక ముడుస్తారా? అనేది చూడాలి. ఐపీఎల్లో ఇరుజట్లు ఇప్పటివరకూ 22 సార్లు తలపడ్డాయి. చెన్నై ఆధిపత్యం చెలాయిస్తూ 16 పర్యాయాలు జయభేరి మోగించింది. 18వ సీజన్లోనూ అదే జోరు చూపాలని ధోనీ సేన భావిస్తోంది. రెండు టీమ్‌లలో మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన ఆటగాళ్లు కొందరున్నారు.
Most wickets in IPL matches between CSK and SRH
18 – Dwayne Bravo (13 mat)
11 – Bhuvneshwar Kumar (17 mat)
10 – T Natarajan (6 mat)
10 – Rashid Khan (10 mat)
10 – Deepak Chahar (12 mat) #IPL2025 pic.twitter.com/1KkeR7Ha8j— CricTracker (@Cricketracker) April 25, 2025
సీఎస్కే విషయానికొస్తే.. ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో(Dwayne Bravo) కీలక పాత్ర పోషించాడు. ఈ మీడియం పేసర్ 13 మ్యాచుల్లో 18 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. 17వ సీజన్ వరకూ హైదరాబాద్‌కు ఆడిన భువనేశ్వర్ కుమార్ 11 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నట్టూగా పేరొందిన నటరాజన్ 10 వికెట్లు తీయగా..స్పిన్నర్ రషీద్ ఖాన్ ఖాతాలోనూ పది వికెట్లు ఉన్నాయి. సీఎస్కే మాజీ పేసర్ దీపక్ చాహర్ 12 మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టాడు.
సురేశ్ రైనా, భువనేశ్వర్
చెన్నై, హైదరాబాద్ మ్యాచుల్లో టాప్ స్కోర్ర్ సురేశ్ రైనా(Suresh Raina). ఈ లెఫ్ట్ హ్యాండర్ 432 రన్స్ సాధించాడు. ప్రస్తుతం సీఎస్కే సారథి ధోనీ 430 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. సన్‌రైజర్స్ తరఫున కేన్ విలియమ్సన్ 427 పరుగులు కొట్టగా.. మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 405 పరుగులతో నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. సీఎస్కే మాజీ కెప్టెన్ రుతురాజ్ సైతం ఇరుజట్ల పోరులో ఇరగదీశాడు. ఈ యంగ్‌స్టర్ 394 రన్స్ బాదాడు.
Hello from Chennai 📍
We are moments away from the #CSKvSRH clash 🤜🤛
Who will bag 2️⃣ points tonight? #TATAIPL | @ChennaiIPL | @SunRisers pic.twitter.com/AFA1slhMh1
— IndianPremierLeague (@IPL) April 25, 2025
ప్రస్తుతం 18వ సీజన్లో సీఎస్కే బ్యాటింగ్‌లో తడబడుతోంది. సన్‌రైజర్స్ టాపార్డర్ సైతం నిలకడలేమిని కొనసాగిస్తున్నారు. దాంతో, ఇరుజట్లు ఆరు ఓటములతో అట్టడుగున నిలిచాయి. ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరవుతున్న వేళ ఈ మ్యాచ్ చావోరేవో కానుంది. విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, అనికేత్ చెలరేగితే కమిన్స్ సేనకు తిరుగుండదు. ఒకవేళ.. చెన్నై బౌలర్లు ఆదిలోనే వికెట్లు తీసినా.. స్పిన్నర్లు తిప్పేసినా.. సన్‌రైజర్స్ కథ కంచికి చేరడం ఖాయం.