Allu Arjun| అల్లు అర్జున్ సినిమాలంటే జనాలలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ నటించిన పుష్ప2 చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టింది. ఈ చిత్రం ఏకంగా రూ.1800కోట్లు వసూలు చేసింది. దాదాపు `బాహుబలి 2` రికార్డులను బ్రేక్ చేసింది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్‌తో కలిసి సంచలనాలకి తెర లేపిన బన్నీ ఇప్పుడు మరో భారీ సినిమాతో రాబోతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్‌గా, ఇండియాలో ఇప్పటి వరకు రాని జోనర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. మూవీకి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఇటీవల ముంబై బాంద్రాలోని మోహబూబా స్థూడియోస్ లో అల్లు అర్జున్ లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫొటో షూట్ జరిగినట్లు సమాచారం. బన్నీ పాత్ర కోసం డైరెక్టర్ అట్లీ డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. రగ్గడ్ నుంచి స్టైలిష్ వరకు ఇలా చాలా ట్రై చేసిన అట్లీ చిత్రంలో అల్లు అర్జున్ ని ఓ భిన్నమైన ఇమేజ్ తో పరిచయం చేయాలని అనుకుంటున్నారట అట్లీ. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ చివరి వరకు చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలుస్తుంది. సినిమా తారాగణానికి సంబంధించిన విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా మృణాల్ ఠాకూర్‌ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇటీవల కథని మృణాల్‌కి చెప్పగా, ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. మృణాల్ బన్నీ పక్కన బాగుంటుందని, వారి జోడి చూడముచ్చటగా ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మృణాల్తో పాటు దీపికా పదుకొణే, జాన్వీ కపూర్ కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై అయితే క్లారిటీ రావలసి ఉంది. టైమ్ ట్రావెల్, సూపర్ హీరోలను తలపించేలా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఏది ఏమైన ఈ సినిమాతో బన్నీ హాలీవుడ్ రేంజ్‌కి కూడా చేరుకుంటాడని సమాచారం.