BRS CHIGURUMAMIDI | చిగురుమామిడి, ఏప్రిల్ 25: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభకు మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. నవాబుపేట గ్రామంలో రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్ ను శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బూటకపు హామీలతో అమలులోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పతనానికి ఈ బహిరంగ సభ నాంది కావాలని, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కట్టడానికి గ్రామ గ్రామాన కార్యకర్తలు కంకణ బద్ధులై తరలిరావాలన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను వివరిస్తూ ప్రజలను బహిరంగ సభకు తోడుకొని రావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ మండలాధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, గ్రామ అధ్యక్షుడు పిల్లి వేణు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ కో ఆప్షన్ సభ్యుడు మక్బూల్ పాషా, నాయకులు శరభంద రెడ్డి, కిష్టారెడ్డి, బోయిని సతీష్, కొక్కిస రవీందర్, ఆగయ్య, కూతురు రాజిరెడ్డి, ఎడెల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.