Greg Chappell : భారత క్రికెట్లో ఒకప్పుడు సంచలనంగా మారిన పేరు పృథ్వీ షా (Prithvi Shaw). ఈ ముంబై కుర్రాడు ఆడితే రికార్డులు బద్ధలయ్యేవి. ఇంకేముంది.. భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ వారసుడు దొరికేశాడంటూ పలువురు మాజీ ఆటగాళ్లు పృథ్వీకి కితాబిచ్చారు. కానీ, ఈ యంగ్‌స్టర్ విషయంలో అంతా తలకిందులైంది. జాతీయ జట్టులో కాదు కదా.. కనీసం రంజీ టీమ్‌లో కూడా అతడికి అవకాశాలు రావడం లేదు. ఈమధ్యే ముంబై సెలెక్టర్లు రంజీ జట్టు నుంచి పృథ్వీని తప్పించారు. ఈ సమయంలో భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ (Greg Chappell) అతడికి బాసటగా నిలుస్తున్నాడు.
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) వదిలేసిన బాధ నుంచి తేరుకోకముందే పృథ్వీ షాకు ముంబై సెలెక్టర్లు పెద్ద షాచిచ్చారు. ఫామ్‌తో పాటు క్రమశిక్షణలోనూ విఫలమైన అతడిపై వేటు వేశారు. దాంతో, భారత జట్టుకు మళ్లీ ఆడే అవకాశాలు చేజారుతున్న వేళ పృథ్వీకి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ అయిన చాపెల్ ఓ లేఖ రాశాడు. ఆ లేఖలో ఏం రాసుకొచ్చాడో తెలుసా..?
Former Australian legend Greg Chappell pens a heartfelt letter to under-firing Prithvi Shaw. pic.twitter.com/KMfRFTmFYD
— CricTracker (@Cricketracker) November 7, 2024
‘హలో పృథ్వీ.. ఇప్పుడు నువ్వు కష్టమైన దశ ఎదుర్కొంటున్నావని నాకు అర్థమవుతోంది. ముంబై జట్టులో స్థానం కోల్పోవడం నీకు ఎంతో చిరాకు తెప్పించి ఉంటుంది. అయితే.. ప్రతి క్రీడాకారుడి జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి కచ్చింతగా ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకో. క్రికెట్ లెజెండ్స్‌లో ఒకడైన డాన్ బ్రాడ్‌మన్‌కు కూడా ఇలాంటి పరిస్థితి తప్పలేదు. అతడు కూడా కొన్నిసార్లు జట్టులో చోటు కోల్పోయాడు. అనంతరం సత్తా చాటి మళ్లీ జట్టులోకి వచ్చాడు. గతం అనేది నిన్ను వర్ణించలేదు. పృథ్వీ.. ఈ విషయాలు మర్చిపోవద్దు. ఇకపై ఆటపై బాగా దృష్టి పెట్టు. ఏమైనా సలహాలు కావాల్సి వస్తే మొహమాటం లేకుండా నన్ను సంప్రదించు’ అని చాపెల్ ఓ లేఖ రాశాడు.
కోచ్‌గా ఉన్న సమయంలో భారత జట్టును దివాళా తీయించిన చాపెల్.. పృథ్వీకి ఉచిత సలహాలు ఇవ్వడం భలే వింతగా ఉందంటున్నారు టీమిండియా మాజీ ఆటగాళ్లు కొందరు. 2005 నుంచి 2007 మధ్య చాపెల్ భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. అప్పటి కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఫిట్నెస్, ప్రవర్తన గురించి చాపెల్ పదేపదే బీసీసీఐకి ఉత్తరాలు రాయడం పెద్ద దుమారమే రేపింది. తన కెరీర్‌కు అడ్డుపడుతున్న చాహల్‌పై దాదా బాహాటంగానే తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
All chappel did was tell unfit seniors to get fitter and transformed the side by promoting the likes of Dhoni and Raina
And he’s literally one of the greatest batters in the history ffs if he’s saying something it has some weightage no cricketer as good has ever coached India https://t.co/mdAlirvpnK
— C0l0mbianps5 (@Colombianps5) November 8, 2024