అమరావతి : ఏపీలో వైసీపీకి (YCP) చెందిన సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని (Varra Ravinder Reddy) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులోని మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో అతడిని పట్టుకున్నారు. రెండురోజుల క్రితం పోలీసుల నుంచి తప్పించుకున్న అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pawankalyan), హోంమంత్రి అనిత, టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) , విజయమ్మపై కూడా వ్యక్తిగత హనానికి పాల్పడుతూ సోషల్ మీడియాలో (Social Media) పోస్టులు పెట్టిన రవీందర్‌రెడ్డిని అరెస్టు చేశారు.
అయితే అతడిని వెంటనే స్టేషన్ బెయిల్ కింద విడుదల చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వెంటనే ఐజీ స్థాయి అధికారిని కడప జిల్లాకు పంపి ఎస్పీతో వివరణ తీసుకుంది. సంతృప్తి చెందని ప్రభుత్వం జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజును అక్కడి నుంచి బదిలీ చేసి డీఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
స్థానిక సీఐతో పాటు ఎస్సైపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎంపీ అవినాష్ అనుచరుడైన వర్రా రవీందర్‌రెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు నిర్వహించారు. చివరకు శుక్రవారం రాత్రి ఆయన పోలీసులకు చిక్కారు. అతడిపై కడప, రాజంపేట , మంగళగిరి స్టేషన్లలో కేసులు నమోదయి ఉన్నాయి.