Sundeep Kishan | యువ హీరో సందీప్‌కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ ఏడాది ‘ఊరిపేరు భైరవకోన’, రాయన్ చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్న సందీప్ ఈ మూవీలు ఇచ్చిన సక్సెస్‌తో మూడు ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేశాడు. ఇందులో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో ‘వైబ్’ అనే సినిమా చేస్తున్న సందీప్.. ‘ధమాకా’ మూవీతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో మాజాకా అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఇవి కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను సందీప్ పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.
గత కొన్ని ఏండ్లుగా హిట్లు లేక సతమవుతున్న డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన తర్వాతి చిత్రం సందీప్ కిషన్‌తో తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి ఫ్లాప్‌లను అందుకున్న పూరి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సందీప్ కిషన్ కోసం ఒక కథ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను పూరి సొంత ప్రోడక్షన్ వైష్ణో అకాడమీ నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవ్వనున్నాయి.