Virat Kohli | ‘ఇదొక గొప్ప గౌరవం.. థాంక్యూ సర్’.. కోహ్లీ ఇన్స్టా పోస్ట్ వైరల్
Virat Kohli : వరల్డ్ కప్ ట్రోఫీతో ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)ని కలిసిన భారత జట్టు సభ్యులు తమ విజయానికి దక్కిన గౌరవమర్యాదలను చూసి పొంగిపోతున్నారు. ప్రధాని నివాసంలో బ్రేక్ఫాస్ట్.. ఫొటో సెషన్ తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli) మోడీకి ధన్యవాదాలు తెలిపాడు.
Virat Kohli : బార్బడోస్ నుంచి పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టు (Team Inida)కు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగడంతో మొదలైన అభినందనల వెల్లువ ఇంకా రెట్టింపు అవుతోంది. వరల్డ్ కప్ ట్రోఫీతో ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)ని కలిసిన భారత జట్టు సభ్యులు తమ విజయానికి దక్కిన గౌరవమర్యాదలను చూసి పొంగిపోతున్నారు. ప్రధాని నివాసంలో బ్రేక్ఫాస్ట్.. ఫొటో సెషన్ తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రైమ్ మినిస్టర్ మోడీకి ధన్యవాదాలు తెలిపాడు.
అల్పాహారం తర్వాత ప్రధానికి షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫొటోను విరాట్ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఆ ఫొటోకు ‘గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం నిజంగా గొప్ప గౌరవం. మమ్మల్ని ప్రధాని నివాసానికి ఆహ్వానించినందుకు థ్యాంక్యూ సర్’ అని క్యాప్షన్ రాశాడు.
వరల్డ్ కప్ ట్రోఫీతో ప్రధాని మోడీని కలవడం పట్ల లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ సైతం సంతోషం వ్యక్తం చేశాడు. ‘జట్టు సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీగారిని కలవడం ఎంతో గర్వంగా ఉంది. ప్రోత్సాహకరమైన మీ మాటలకు ధన్యవాదాలు సర్’ అని చాహల్ తన పోస్ట్లో వెల్లడించాడు.
ఓపెన్ టాప్ బస్సులో..
ఢిల్లీలో ప్రధానితో ఫొటో దిగాక భారత జట్టు ముంబై బయల్దేరింది. సాయంత్రం 4:30 గంటలకు ‘మెరైన్ డ్రైవ్’ పరేడ్ షురూ కానుంది. అక్కడ ఓపెన్ టాప్ బస్సులో రోహిత్ సేన వరల్డ్ కప్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ.. సందడిగా ముందుకు సాగనుంది. అనంతరం రాత్రి 7 గంటలకు వాంఖడే స్టేడియంలో జగజ్జేతలకు బీసీసీఐ సన్మానం చేయనుంది.
Magical Evening Awaits 🤩
Join us in welcoming and celebrating the #T20WorldCup Champions 🇮🇳 🏆
📍 Wankhede Stadium
🗓️ Thursday, 4th July 2024
⏰ 4:00 PM IST Onwards
Enter via Gates 2, 3 and 4#TeamIndia pic.twitter.com/UYIZgIkZly— BCCI (@BCCI) July 4, 2024
ఇవి కూడా చదవండి
- Saripodhaa Sanivaaram | ఇంతకీ నాని ఎటు వెళ్తున్నాడో.. సరిపోదా శనివారం సెకండ్ లుక్
- Team India Parade | ముంబైలో ‘విక్టరీ పరేడ్’.. అభిమానులూ ఇవి గుర్తుపెట్టుకోండి
- PM Modi | ప్రధాని మోదీకి బీసీసీఐ ప్రత్యేక బహుమతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

