PM Modi | ప్రధాని మోదీకి బీసీసీఐ ప్రత్యేక బహుమతి
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (PM Modi) టీమ్ ఇండియా క్రికెటర్లు ఇవాళ కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీకి బీసీసీఐ (BCCI) ప్రత్యేక బహుమతి అందించింది.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (PM Modi) టీమ్ ఇండియా క్రికెటర్లు ఇవాళ కలిసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం స్వదేశానికి చేరుకున్న రోహిత్ సేన.. ఉదయం 11 గంటలకు ప్రధాని నివాసంలో మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీకి బీసీసీఐ (BCCI) ప్రత్యేక బహుమతి అందించింది. ‘నమో’ నెంబర్ 1 పేరున్న (Namo 1 jersey) ప్రత్యేక టీమ్ ఇండియా జెర్సీని అందజేసింది. భారత ఆటగాళ్ల సమక్షంలో బీసీసీఐ సెక్రటరీ జైషా (Jay Shah), అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binny) ఈ జెర్సీసి మోదీకి ప్రెజెంట్ చేశారు.
BCCI Secretary Jay Shah and President Roger Binny presented the ‘Namo 1’ jersey to Prime Minister Narendra Modi.
Indian Cricket Team met with PM Narendra Modi, at his official residence today.
(Picture Source- BCCI) pic.twitter.com/iSHZdVAeiu
— ANI (@ANI) July 4, 2024
ప్రధాని మోదీతో భేటీ అనంతరం టీమ్ఇండియా జట్టు ముంబైకి బయల్దేరి వెళ్లింది. సాయంత్రం విజయోత్సవ ర్యాలీలో పాల్గొననుంది. ముంబైలోని ప్రఖ్యాత నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం దాకా (సుమారు రెండు కిలోమీటర్లు) ఓపెన్ బస్లో ప్రపంచకప్ వీరులు విక్టరీ పరేడ్లో పాల్గొంటారు. ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియాను గౌరవించుకునేందుకు విజయోత్సవ ర్యాలీలో భారీగా పాల్గొనండి’ అని ట్వీట్ చేశాడు.
‘ఈ ఆనంద క్షణాలను మేము మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. మెరైన్ డ్రైవ్ నుంచి మొదలుకాబోయే విక్టరీ పరేడ్లో కలుద్దాం’ అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ర్యాలీ ముగిశాక బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడేలో ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి చిరు సత్కారం ఏర్పాటు చేసింది. బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్మనీనీ ఇక్కడే అందజేసే అవకాశమున్నట్టు సమాచారం.
Also Read..
Team India | ప్రధాని మోదీతో ముగిసిన టీమ్ ఇండియా క్రికెటర్ల భేటీ.. ముంబైకి పయనం
Team India | విమానంలో టీమ్ఇండియా సెలబ్రేషన్స్.. రోహిత్ శర్మ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ చూశారా.. VIDEO
Hemant Soren | ఈరోజే జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం.. గవర్నర్ ప్రకటన
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

