Team India | ప్రధాని మోదీతో ముగిసిన టీమ్ ఇండియా క్రికెటర్ల భేటీ.. ముంబైకి పయనం
Team India | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో టీమ్ ఇండియా (Team India) ప్లేయర్ల భేటీ ముగిసింది.
Team India | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో టీమ్ ఇండియా (Team India) ప్లేయర్ల భేటీ ముగిసింది. టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లు ఇవాళ ఉదయం బార్బడోస్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా ప్లేయర్స్‌కు అపూర్వ స్వాగతం లభించింది. స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లు ఐటీసీ మయూర హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఫ్రెష్ అయ్యి.. నేరుగా ప్రధానిని కలిసేందుకు లోక్ కల్యాణ్ మార్గ్ (Lok Kalyan Marg)లోని మోదీ నివాసానికి వెళ్లారు.
మోదీతో భేటీ అయ్యారు. ప్రధానితో కలిసి క్రికెటర్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతి క్రికెటర్‌ను మోదీ ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు. మోదీతో భేటీ అనంతరం క్రికెటర్లంతా బస్సులో ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో టీమ్ ఇండియా ముంబైకి బయల్దేరుతుంది. సాయంత్రం విజయోత్సవ ర్యాలీలో పాల్గొననుంది. ముంబైలోని ప్రఖ్యాత నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం దాకా (సుమారు రెండు కిలోమీటర్లు) ఓపెన్ బస్‌లో ప్రపంచకప్ వీరులు విక్టరీ పరేడ్‌లో పాల్గొంటారు. ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియాను గౌరవించుకునేందుకు విజయోత్సవ ర్యాలీలో భారీగా పాల్గొనండి’ అని ట్వీట్ చేశాడు.
VIDEO | T20 World Cup-winning Indian cricket team met PM Modi at his residence earlier today.
(Source: Third Party) pic.twitter.com/MuNhVmNroD
— Press Trust of India (@PTI_News) July 4, 2024
‘ఈ ఆనంద క్షణాలను మేము మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. మెరైన్ డ్రైవ్ నుంచి మొదలుకాబోయే విక్టరీ పరేడ్‌లో కలుద్దాం’ అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ర్యాలీ ముగిశాక బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడేలో ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి చిరు సత్కారం ఏర్పాటు చేసింది. బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీనీ ఇక్కడే అందజేసే అవకాశమున్నట్టు సమచారం.
#WATCH | Indian Cricket team en route to Delhi Airport to depart for Mumbai where a victory parade has been scheduled in Marine Drive and Wankhede Stadium.
The team met Prime Minister Narendra Modi in Delhi. pic.twitter.com/7K7fwJEMNY
— ANI (@ANI) July 4, 2024
Also Read..
UK elections | బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. తేలనున్న సునాక్ భవితవ్యం
Thief | ఇంటిని దోచుకుని.. నెలలో తిరిగిచ్చేస్తానంటూ లేఖ రాసిన దొంగ
Anant Weds Radhika | అంబానీ ఇంట సంప్రదాయ మామేరు వేడుక.. మెరిసిపోయిన పెళ్లికూతురు.. వీడియోలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

