UK elections | బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. తేలనున్న సునాక్ భవితవ్యం
UK elections | బ్రిటన్ (britain)లో సార్వత్రిక ఎన్నికల (UK Election 2024) సమరం మొదలైంది. ఈరోజు (జూలై 4న) ప్రధాని పదవి కోసం ఓటింగ్ జరుగుతోంది.
UK elections | బ్రిటన్ (britain)లో సార్వత్రిక ఎన్నికల (UK Election 2024) సమరం మొదలైంది. ఈరోజు (జూలై 4న) ప్రధాని పదవి కోసం ఓటింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 650 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఏ పార్టీ అయినా మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు అవసరం ఉంటుంది. ఈ ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party), కెయిర్ స్టార్మర్ (Keir Starmer) ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ (Labour party) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం 46.5 మిలియన్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తదుపరి ప్రధానిని ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం 40 వేల పోలింగ్ బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. బ్రిటన్‌లోని స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.
గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ (Rishi Sunak) బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే, ప్రధానిగా సునాక్ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని హోదాలో తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న సునాక్‌కు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ఈ ఎన్నికల్లో (UK general election) అధికార కన్జర్వేటివ్ పార్టీ (Conservative party)కి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. కాగా, 2019లో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది. 365 సీట్లు గెలుచుకుంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ 202 సీట్లకే పరిమితమైంది. ఇక ఈ ఎన్నికల్లో గెలుపెవరిదన్నది త్వరలోనే తేలిపోనుంది.
Also Read..
Thief | ఇంటిని దోచుకుని.. నెలలో తిరిగిచ్చేస్తానంటూ లేఖ రాసిన దొంగ
Anant Weds Radhika | అంబానీ ఇంట సంప్రదాయ మామేరు వేడుక.. మెరిసిపోయిన పెళ్లికూతురు.. వీడియోలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

