Saripodhaa Sanivaaram | వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా వస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ షేర్ చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరోవైపు సూర్య మ్యాడ్నెస్ కౌంట్ డౌన్ షురూ.. అంటూ ఫస్ట్ సింగిల్ Garam Garam గరం గరం సాంగ్ రిలీజ్ చేశారని తెలిసిందే. తాజాగా సెకండ్ లుక్‌ను విడుదల చేశారు.
నాని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని సరదాగా చిల్ అవుట్ మూడ్‌లో బైకుపై వెళ్తున్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ నాని మరి ఎటు వెళ్తున్నాడబ్బా అంటూ తెగ చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. దీనిపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. గ్యాంగ్‌లీడర్ తర్వాత నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.
ఈ మూవీలో ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు.యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తోంది. సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుండగా.. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో రిలీజ్ అవుతుంది.
ఈ మూవీ నుంచి తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే గరం గరం సాంగ్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Every raging Saturday has its calm counterpart 😎
Now, Experience a new dimension of Surya on other days ❤️#SaripodhaaSanivaaram #SuryasSaturday
Natural 🌟 @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe@muraligdop @karthikaSriniva @SVR4446 @IamKalyanDasari… pic.twitter.com/UngM0bMWum
— DVV Entertainment (@DVVMovies) July 4, 2024
Sunaina | యూట్యూబర్‌తో మరాఠీ భామ నిశ్చితార్థం.. క్రేజీ గాసిప్‌లో నిజమెంత..?