Darshan wife | ఆమె దర్శన్ భార్య కాదు.. పవిత్రాగౌడపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి
Darshan wife | రేణుకాస్వామి హత్యకేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan) దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. తాజాగా బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి లేఖ రాసింది.
Darshan wife | రేణుకాస్వామి హత్యకేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan)తోపాటు నటి పవిత్రగౌడను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులుండగా.. కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే కేసు విచారణలో పవిత్ర, దర్శన్‌ను దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం తెలిపింది.
ఈ మేరకు తాజాగా బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు విజయలక్ష్మి లేఖ రాసింది. పవిత్రాగౌడను నా భార్త పెళ్లి చేసుకోలేదు. విచారణలో పోలీసులు దంపతులుగా పేర్కొన్నారు. కర్నాటక హోంమంత్రి కూడా ఇదే మాట అన్నారని లేఖలో పేర్కొన్నది. హోంమంత్రి ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. నటుడి దంపతులు అరెస్టయ్యారని చెప్పారని విజయలక్ష్మి గుర్తు చేసింది. ఆమె దర్శన్ భార్య కాదు.. కేవలం నా భర్తకు స్నేహితురాలు మాత్రమే.
దర్శన్‌కు చట్టపరమైన జీవిత భాగస్వామిని నేను మాత్రమే. మా పెండ్లి 2003లో జరిగింది. పోలీస్ రికార్డుల్లో పవిత్ర గౌడను సతీమణిగా పేర్కొనవద్దు. ఇది భవిష్యత్‌లో నాకు, నా కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుంది. పవిత్రకు సంజయ్‌సింగ్‌తో పెండ్లి కాగా.. వారికి ఓ కూతురు కూడా ఉంది. దయచేసి ఈ వాస్తవాలను రికార్డుల్లో స్పష్టంగా రాయండి.. అని సీపీకి రాసిన లేఖలో కోరింది విజయ లక్ష్మి. ఇక ఈ కేసులో దర్శన్‌పై నెట్టింట ట్రోల్స్ వెల్లువెత్తగా.. మరోవైపు త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని దర్శన్ నిజాయితీగా బయటకు వస్తాడని పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

